జయరాం హత్య కేసులో అనేక సంచలనాలను వెల్లడించిన రాకేష్
మెదక్ జిల్లా బొంతపల్లి లోని పాలీ లెన్సెస్ టెక్ట్రాన్ కంపీనీ లో ఉద్యోగుల జీతాల విషయంలో సమస్య పరిష్కరించడానికి రెండేళ్ల క్రితం నన్ను మీడియేటర్ గా తీసుకున్నాడు [more]
మెదక్ జిల్లా బొంతపల్లి లోని పాలీ లెన్సెస్ టెక్ట్రాన్ కంపీనీ లో ఉద్యోగుల జీతాల విషయంలో సమస్య పరిష్కరించడానికి రెండేళ్ల క్రితం నన్ను మీడియేటర్ గా తీసుకున్నాడు [more]

మెదక్ జిల్లా బొంతపల్లి లోని పాలీ లెన్సెస్ టెక్ట్రాన్ కంపీనీ లో ఉద్యోగుల జీతాల విషయంలో సమస్య పరిష్కరించడానికి రెండేళ్ల క్రితం నన్ను మీడియేటర్ గా తీసుకున్నాడు జయరాం..తెలిసిన వ్యక్తుల ద్వారా ఆయనకి పరిచయం అయ్యాను .. ఆ సమయంలోనే తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న జయరాం కు నాలుగున్నరకోట్లు వేరే వ్యక్తులద్వారా అప్పు తీసుకొచ్చి ఇచ్చాను..ఆ సమయంలోనే అదే కంపెనీలో కీలకంగా వ్యవహరించిన శిఖా నాకు పరిచయం అయింది..ఆమెతో కొన్నాళ్లుడేటింగ్ చేశాను .. ఆమెని దుబాయి తీసుకెళ్లాను..ఆమె నా చేత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించింది….ఆమెకు ఖర్చు పెట్టిన డబ్బు జయరాం ఇస్తా అన్నాడు కానీ కంపెనీ కోసం తీసుకున్నడబ్బే నాకు ఇప్పటివరకూ ఇవ్వలేదు..అలాంటిది ఆమె ఇవ్వల్సిన డబ్బుఎలా ఇస్తావని అడిగాను….ఆ తర్వాత చాలా సార్లు జయరాం ను డబ్బుల కోసం అడిగినా ఇవ్వలేదు..
చివరికి గత నెల 29 వ తేదీ న జయరాం ఇండియా వచ్చినపుడు ఆయన్న్ని బంజారా హిల్స్ రోడ్ నంబర్ 10 లోని నా ఇంటికిపిలిపించాను..అక్కడ నాకివ్వాల్సిన డబ్బులు కోసం జయరాం పదిమందికిపైగా తెలిసిన వారికి ఫోన్ చేశాడు..కానీ ఎవరూ అతనికి డబ్బులు ఇవ్వడానికి ముందుకురాలేదు..చివరికి కోస్టల్ బ్యాంక్ లో గతంలో మేనేజర్ గా పని చేసిన ఒకతను ఆరు లక్షలు ఇస్తా అన్నాడు..హార్ట్ పేషంట్ కావడంతో నేను కోపంతో రెండుదెబ్బలు వేయగానే జయరాం చనిపోయాడు .. ఏమి చేయాలోతెలీక సాయంత్రం వరకూ ఇంట్లోనే మ్రుతదేహం ఉంచాను..సాయంత్రం కారులో శవాన్ని ఎక్కించి విజయవాడ వైపు తీసుకొచ్చి నందిగామ సమీపంలో శవాన్నికారుతో సహా వదిలి బస్సు ఎక్కి హైదరాబాద్ వెళ్లిపోయాను..శిఖా చౌదరి నాలాగే చాల మంది జీవితాలతో ఆడుకుంది…. ఆమె డబ్బులకోసం ఏమైనా చేస్తుంది ..నేను జయరాం ని చంపాలని కొట్టలేదు .. కోపంతో రెండుదెబ్బలు వేయగానే చనిపోయాడు