కీలక భేటీ
రెండు దేశాధినేతల మధ్య కీలక చర్చలకు సమయం దగ్గరపడింది. ఈరోజు తమిళనాడులోని మహాబలిపురంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల మధ్య [more]
రెండు దేశాధినేతల మధ్య కీలక చర్చలకు సమయం దగ్గరపడింది. ఈరోజు తమిళనాడులోని మహాబలిపురంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల మధ్య [more]

రెండు దేశాధినేతల మధ్య కీలక చర్చలకు సమయం దగ్గరపడింది. ఈరోజు తమిళనాడులోని మహాబలిపురంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ల మధ్య చర్చలు జరగనున్నాయి. ఇది అధికారిక చర్చలు కావు. స్పష్టమైన అజెండా ఈ సమావేశంలో లేకపోవడం వల్లనే దీనిని అనధికారిక చర్చలుగానే పరిగణిస్తారు. ముఖ్యంగా భారత్, చైనాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడటానికి ఈ చర్చలు దోహదపడతాయని భావిస్తున్నారు. ముఖ్యంగా కాశ్మీర్ అంశంలో చైనా పాక్ వైపునకు మళ్లకుండా ఉండేందుకు ఈ చర్చలు ఉప కరిస్తాయంటున్నారు.
మహాబలిపురంలో….
ఈరోజు మధ్యాహ్నానికి జిన్ పింగ్ చెన్నై చేరుకుంటారు. అక్కడి నుంచి మహాబలిపురం వెళతారు. చెన్నై విమానాశ్రయంలో మోదీ జిన్ పింగ్ కు స్వాగతం పలకనున్నారు. మరికాసేపట్లో మోదీ చెన్నైకి చేరుకోనున్నారు. చెన్నై నుంచి మహాబలిపురానికి రోడ్డు మార్గం ద్వారానే వెళ్లనున్నారు. ఈ సందర్భంగా తమిళనాడులో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మొత్తం మీద జిన్ పింగ్ భారత పర్యటన ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయని భావిస్తున్నారు.