Tue Aug 09 2022 22:47:29 GMT+0000 (Coordinated Universal Time)
Nagababu : ప్రకాష్ రాజుకు మెగా ఫ్యామిలీ సపోర్ట్

“మా” ఎన్నికల్లో వందశాతం ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తామని నాగబాబు తెలిపారు. చిరంజీవి కూడా ఆయనకు మద్దతిస్తున్నారన్నారు. భారతదేశంలో అతి కొద్దిమంది కళాకారుల్లో ప్రకాష్ రాజ్ ఒకరని నాగబాబు ఒకరని గుర్తు చేశారు. ఆయనను రాష్ట్రేతరుడిగా అనడం సిగ్గుచేటని అన్నారు. ప్రకాష్ రాజ్ పది రోజులకు కోటి రూపాయలు వదులుకుని మా కోసం వచ్చారన్నారు. సంకుచిత ఆలోచనలు మాని ప్రకాష్ రాజ్ ను మన వాడిగా గుర్తించాలన్నారు. వయసు పెరిగే కొద్దీ జ్ఞానం అలవర్చుకోవాలన్నారు.
Next Story