కోమటిరెడ్డిపై వేటుకు సిద్ధం..!!
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే అధిష్టానం [more]
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే అధిష్టానం [more]

మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమయింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలను ఇప్పటికే అధిష్టానం దృష్టికి కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తీసుకెళ్లింది. రాహుల్ పైన ఆయన చేసిన వ్యాఖ్యలను పార్టీ సీరియస్ గా తీసుకుంది. తాజాగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్కపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా పంపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీలో చేరక ముందే పార్టీ నుంచి బహిష్కరించాలని కాంగ్రెస్ హైకమాండ్ దాదాపుగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నేడో, రేపో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై వేటు పడే అవకాశముందని గాంధీ భవన్ వర్గాలు వెల్లడించాయి.