జగన్ ఆల్ ది బెస్ట్.. కంగ్రాట్స్
గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని, ఏ సమస్య వచ్చినా 72 గంటల్లో పరిష్కారం అయ్యే విధంగా మీరు పనిచేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ [more]
గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని, ఏ సమస్య వచ్చినా 72 గంటల్లో పరిష్కారం అయ్యే విధంగా మీరు పనిచేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ [more]

గ్రామాల్లో కనీస సదుపాయాలు కల్పించాలని, ఏ సమస్య వచ్చినా 72 గంటల్లో పరిష్కారం అయ్యే విధంగా మీరు పనిచేయాలని పిలుపునిచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. గ్రామ, వార్డు సచివాలయ రాతపరీక్షల్లో అర్హత సాధించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కూడా పూర్తై ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయన నియామక పత్రాలు అందజేశారు. విజయవాడలోని కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ మాట్లాడారు. అధికారం చెలాయించడం కోసం ఉద్యోగం చేయడం లేదు.. సేవ చేయడం కోసమే ఈ ఉద్యోగం చేస్తున్నాం అనే విషయాన్ని ప్రతీ గ్రామ, సచివాలయ ఉద్యోగి గుర్తుపెట్టుకోవాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.
ప్రజలకు పథకాలు చేరాలి …..
గ్రామ వాలంటీర్లతో అనుసంధానమై ప్రతీ పేదవాడికి పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు చేరేలా చూడాలని విఙ్ఞప్తి చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను అక్టోబర్ 2వ తేదీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా పనిచేయండి, మనకు ఓటేయని వారు కూడా మళ్లీ వచ్చే ఎన్నికల్లో మనకే ఓటు వేసేలా మీరంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో సమస్యలు వెంటిలెటర్ పై ఉన్నాయని వాటికి మీరే చికిత్స అందించాలన్నారు. అవినీతి, వివక్షతలేని పాలన అందించాలన్నారు. గ్రామ సచివాలయాలకు ఎంపికైన అభ్యర్థులకు వైఎస్ జగన్ ఆల్ ది బెస్ట్ అండ్ కాంగ్రాట్స్ తెలిపారు.