బ్రేకింగ్ : ఎన్టీఆర్ సొంతూరులో జగన్ సంచలన ప్రకటన

వైసీపీ అధినేత జగన్ సంచలన ప్రకటనచేశారు. తెలుగుదేశం పార్టీని, వ్యక్తిగతంగా చంద్రబాబును ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో పర్యటిస్తున్న జగన్ వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కృష్ణా జిల్లకు ఎన్టీఆర్ పేరు పెడతామని ప్రకటించారు. ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకుని అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆయనను పూర్తిగా విస్మరించిందని చెప్పారు. జగన్ ఈ సంచలన ప్రకటనతో టీడీపీ నేతలు ఇబ్బందుల్లో పడినట్లయింది. నిమ్మకూరు స్వర్గీయ ఎన్టీ రామారవు సొంతగ్రామం. ఈ గ్రామాన్ని లోకేష్ దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా నందమూరి కుటుంబ సభ్యులు కొందరు జగన్ ను కలవడం కూడా చర్చనీయాంశమైంది. జగన్ ఈ ప్రకటనతోనిమ్మకూరు గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు నిమ్మకూరులో జరిగిన నీరు-చెట్టు పథకంలో అవినీతి జరిగిందని కొందరు గ్రామస్థులు జగన్ కు ఫిర్యాదు చేయడం గమనార్హం.