ఇద్దరూ భేటీ
ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం [more]
ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం [more]

ఏపీ సీఎం జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లు ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లో కొన్ని అంశాలు ఇంకా పరిష్కారం కాలేదు. అలాగే 9, 10 షెడ్యూళ్లలోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపకాలు, ఉద్యోగుల విభజన, ఇతర అంశాలు పెండింగ్లో ఉన్నాయి. వాటిపై ఇద్దరు సీఎంలూ చర్చిస్తున్నారు. నదుల నీటి సద్వినియోగం, ఏపీకి రావాల్సిన కరెంటు బిల్లులపైనా చర్చ సాగుతుందని సమాచారం. ముఖ్యంగా గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించే అంశంపై ఎక్కువ సేపు చర్చిస్తారని తెలిసింది. అలాగే కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపైనా మాట్లాడనున్నారు. వరద నీటిని అనవసరంగా సముద్రంలోకి పంపడం కన్నా… వాటితో కరవు ప్రాంతాల్లో నీటి కష్టాలు తీర్చాలని ఇద్దరు సీఎంలు కోరుకుంటున్నారు. ఇవి కాకుండా మరిన్ని అంశాలపైనా చర్చ సాగుతుందని తెలిసింది.