బ్రేకింగ్ : చంద్రబాబు ఇంటి చుట్టూ ఇసుక బస్తాలు
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరగడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వరద ముంపు పొంచి ఉంది. విజయవాడలోని కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నివాసం మెట్ల వరకూ [more]
ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరగడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వరద ముంపు పొంచి ఉంది. విజయవాడలోని కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నివాసం మెట్ల వరకూ [more]

ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరగడంతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వరద ముంపు పొంచి ఉంది. విజయవాడలోని కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నివాసం మెట్ల వరకూ వరద నీరు వచ్చి చేరడంతో చంద్రబాబు ఇంటి చుట్టూ ఇసుక బస్తాలను వేసి రక్షణ కల్పిస్తున్నారు. సిబ్బంది నిరంతరం కాపలా కాస్తున్నారు. లింగమనేని గెస్ట్ హౌస్ లోనే గత ఐదేళ్లుగా చంద్రబాబు నివాసం ఉంటున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ప్రస్తుతం విశ్రాంతి కోసం హైదరాబాద్ లో ఉన్నారు. ఇంట్లోకి వరద వస్తుందన్న ఆందోళనతో చంద్రబాబు కాన్వాయ్ ను హ్యాపీ రిసార్ట్స్ కు తరలించారు. కింది గదుల్లో ఉన్న సామాగ్రిని కూడా సిబ్బంది పై గదుల్లోకి చేరుస్తున్నారు. చంద్రబాబు నివాసాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిశీలించారు. తాము చెప్పినట్లుగానే జరుగుతుందని, వరద నీరు చంద్రబాబు నివాసానికి చేరుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు