Thu Feb 13 2025 10:28:03 GMT+0000 (Coordinated Universal Time)
దిశ కేసులో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు
దిశ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన షాద్ నగర్ లో దిశా హత్య కేసుపై హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు [more]
దిశ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన షాద్ నగర్ లో దిశా హత్య కేసుపై హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు [more]

దిశ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన షాద్ నగర్ లో దిశా హత్య కేసుపై హైకోర్టు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడానికి అనుమతి ఇచ్చింది. మహబూబ్ నగర్ లో ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నెలరోజుల్లోపు కేసు విచారణ ముగించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసింది. దిశ సంఘటన పార్లమెంటును కూడా కుదిపేసింది. దీంతో ప్రభుత్వం దిశ కేసు విషయంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు అనుమతివ్వాలని హైకోర్టును కోరడంతో అనుమతిచ్చింది. మరోవైపు దిశ కేసులో నిందితులను పోలీసు కస్టడీకి షాద్ నగర్ కోర్టు అనుమతిచ్చింది.
Next Story