మగాడిని నడిరోడ్డుపై ఆమె ఎందుకు కొట్టింది….?
వివాహేతర సంబంధం భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. భర్త మరో మహిళతో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయింది భార్య. దీంతో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఆలోచన చేసింది. [more]
వివాహేతర సంబంధం భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. భర్త మరో మహిళతో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయింది భార్య. దీంతో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఆలోచన చేసింది. [more]

వివాహేతర సంబంధం భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టింది. భర్త మరో మహిళతో కలిసి ఉండడాన్ని జీర్ణించుకోలేకపోయింది భార్య. దీంతో భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని ఆలోచన చేసింది. ఇందుకోసం డేగ కళ్లతో అవకాశం కోసం ఎదురు చూసి అనుకున్నది సాధించింది. మరో స్త్రీతో ఉన్న భర్తను పట్టుకుని చితకబాదింది. ఈ ఘటన హైదరాబాదులో చోటుచేసుకుంది.
అక్రమ సంబంధం పెట్టుకోవడంతో….
సికింద్రాబాదు కు చెందిన గోపాల్ కు ఏడు సంవత్సరాల క్రితం తమిళనాడుకు చెందిన ఎస్తేరుతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు. కొంత కాలంగా గోపాల్ భార్యకు దూరంగా ఉంటున్నాడు . ఆయన మరో స్త్రీతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడనే విషయం తెలుసుకుంది. దీంతో ఎస్తేరు తన కుటుంబ సభ్యులతో కలిసి గోపాల్ తో సంబంధమున్న మహిళ ఇంటికి చేరుకుంది. అప్పటికే గోపాల్ ఆమెతో కలిసి అక్కడే ఉన్నాడు. వెంటనే సదరు మహిళను గోపాల్ ను ఎస్తేరు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని చితకబాదింది. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.