జగన్ కు నేడు నిపుణల కమిటీ నివేదిక
ఈరోజు సాయంత్రం రాజధాని పై నిపుణుల కమిటి నివేదిక ప్రభుత్వానికి చేరనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అంటూ సియం జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో [more]
ఈరోజు సాయంత్రం రాజధాని పై నిపుణుల కమిటి నివేదిక ప్రభుత్వానికి చేరనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అంటూ సియం జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో [more]

ఈరోజు సాయంత్రం రాజధాని పై నిపుణుల కమిటి నివేదిక ప్రభుత్వానికి చేరనుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానులు అంటూ సియం జగన్ ప్రకటన చేసిన నేపథ్యంలో నిపుణల కమిటీ నివేదిక ఎలా ఉండనుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సీఎం జగన్ ప్రకటనపై ఇప్పటికే భిన్న స్వరాలు వెలువడుతున్నాయి. ఇప్పటకే ముఖ్యమంత్రికి మధ్యంతర నివేదిక సమర్పించిన నిపుణుల కమిటీ ఈరోజు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనుంది. నిపుణుల కమిటీ ఏపీలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి ప్రజాభిప్రాయాలను సేకరించింది. నిపుణుల కమిటీ సూచనల మేరకే తాము నిర్ణయం తీసుకోనున్నామని జగన్ ప్రకటించడంతో నివేదికలో ఏముండనుందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. రాజకీయ పార్టీలు కూడా ఉత్కంఠగా నివేదిక కోసం చూస్తున్నాయి. రాజధానిని మార్చవద్దంటూ రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో నివేదిక ఏం చెప్పనుందన్న టెన్షన్ రాజధాని రైతుల్లో నెలకొంది.