బాబు సమక్షంలోనే డిష్యూం..డిష్యూం
పాణ్యం నియోజకవర్గ సమీక్ష సమావేశంలో చంద్రబాబు సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు తన్నుకున్నారు. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి, పుల్లారెడ్డిలు [more]

పాణ్యం నియోజకవర్గ సమీక్ష సమావేశంలో చంద్రబాబు సమక్షంలోనే తెలుగుదేశం పార్టీ నేతలు తన్నుకున్నారు. కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి, పుల్లారెడ్డిలు దాడికి యత్నించారు. కేడీసీసీ మల్లికార్జున రెడ్డిపై చంద్రబాబు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికపైన ఉన్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు పై దాడికి ప్రయత్నించడం మంచి పద్దతి కాదని, క్రమశిక్షణతో ఉండాలని కార్యకర్తలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. మల్లికార్జున రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలను చంద్రబాబు ఆదేశించారు. కర్నూలు జిల్లాలో చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.