నిజాయితీగా బతికా..ఏ విచారణకైనా సిద్ధం
తాను రాజకీయ జీవితంలో నిజాయితీగా బతికానని, ఏ విచారణకైనా సిద్ధమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రశ్తోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి [more]
తాను రాజకీయ జీవితంలో నిజాయితీగా బతికానని, ఏ విచారణకైనా సిద్ధమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రశ్తోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి [more]

తాను రాజకీయ జీవితంలో నిజాయితీగా బతికానని, ఏ విచారణకైనా సిద్ధమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రశ్తోత్తరాల సమయంలో వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు తన విదేశీ పర్యటనలకు ప్రజాధనం దుర్వినియోగం చేశారని, పెట్టుబడులు రాలేదని, ఉపాధి అవకాశాలు కల్పించలేదన్నారు. చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆ ఖర్చును చంద్రబాబునాయుడు నుంచి రాబట్టాలని కోరారు. దీనిపై చంద్రబాబునాయుడు స్పందిస్తూ తాను ఏవిచారణకైనా సిద్దమన్నారు. ఐదు లక్షల ఉద్యోగాలు వచ్చాయని ప్రభుత్వమే అంగీకరించిందన్నారు. తాను ఉపాధి కల్పన, పెట్టుబడుల కోసమే విదేశీ పర్యటనలు చేశానని, రేయింబవళ్లూ కష్టపడ్డానని చెప్పుకొచ్చారు.