హెరిటేజ్ తో మాకు సంబంధం లేదు
హెరిటేజ్ ఫ్రెష్ తో తమకు సంబంధం లేదని, అది ఫ్యూచర్ గ్రూపునకు సంబంధించిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఉల్లిపాయలు హెరిటేజ్ లో కిలో రెండు [more]
హెరిటేజ్ ఫ్రెష్ తో తమకు సంబంధం లేదని, అది ఫ్యూచర్ గ్రూపునకు సంబంధించిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఉల్లిపాయలు హెరిటేజ్ లో కిలో రెండు [more]

హెరిటేజ్ ఫ్రెష్ తో తమకు సంబంధం లేదని, అది ఫ్యూచర్ గ్రూపునకు సంబంధించిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు వివరణ ఇచ్చారు. ఉల్లిపాయలు హెరిటేజ్ లో కిలో రెండు వందలకు అమ్ముతున్నారన్న సీఎం జగన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించారు. తనపై బురద జల్లుతూ వైసీపీ నేతలు రాక్షసానందం పొందుతున్నారన్నారు. అయితే ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ తమకు ఇటీవల హెరిటేజ్ నుంచి గిఫ్ట్ ప్యాక్ పంపారని, అందులో బ్రాహ్మణి పేరు ఉందని చెప్పారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ హెరిటేజ్ ఫుడ్స్ వేరు, హెరిటేజ్ ఫ్రెష్ వేరు అని, ఆ రెండింటికీ తేడా తెలియకుంటే ఎలా అని చంద్రబాబు ప్రశ్నించారు. గట్టిగా మాట్లాడితే తాను భయపడనని చెప్పారు. తాను మాట్లాడదలచుకుంటే భారతి సిమెంట్స్, సాక్షి మీడియాపై మాట్లాడగలనని చంద్రబాబు అన్నారు. అనంతరం మహిళ భద్రత చట్టంపై చంద్రబాబు మాట్లాడారు.