నా ప్రయత్నాన్ని చంపేశారు
తాను కలలు కన్న అమరావతిని జగన్ ప్రభుత్వం నాశనం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల సమీక్ష చేసిన తర్వాత చంద్రబాబు [more]
తాను కలలు కన్న అమరావతిని జగన్ ప్రభుత్వం నాశనం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల సమీక్ష చేసిన తర్వాత చంద్రబాబు [more]

తాను కలలు కన్న అమరావతిని జగన్ ప్రభుత్వం నాశనం చేస్తుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో నియోజకవర్గాల సమీక్ష చేసిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. అమరావతి నిర్మాణం పూర్తయితే పెద్దయెత్తున ప్రభుత్వానికి ఆదాయం సమకూరేదన్నారు. కానీ జగన్ ప్రభుత్వం శాడిస్ట్ లాగా వ్యవహరిస్తూ పనులు నిలిపేసిందన్నారు. మంచి నగరాన్ని నిర్మించాలనుకున్న తన కోరికను చంపేశారన్నారు. వైసీపీ తీరు దుర్మార్గంగా ఉందన్నారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. వైసీపీవి రివర్స్ టెండర్లు కావని, రిజర్వ్ టెండర్లు అని తెలిపారు. వైసీపీ బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తి లేదని తెలిపారు. తాను అనేక సంక్షోభాలు చూశానని, ఇది ఒక లెక్క కాదని చంద్రబాబు అన్నారు.