Mon Jul 04 2022 12:55:59 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు ఆశ.. అడియాసే..!

రైల్వే జోన్ వల్ల ఏపీకి ఎటువంటి లాభం లేదని, ఒక భవనం, పది మంది గుమస్తాలు పెరుగుతారని.. కానీ కక్షసాధింపు కోసమే రైల్వే జోన్ ఇవ్వడం లేదని అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయాలనుకుంటున్న చంద్రబాబు ఆశ అడియాసే అవుతుందని ఆయన అన్నారు. మంగళవవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టీడీపీ ఎంపీ మాగంటి బాబు దీక్షకు జేసీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశాన్ని మార్చడం రాహుల్ గాంధీకి చేతకాదని అన్నారు. కొడుకుని ప్రధానిని చేసుకునేందుకు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇస్తారన్న చంద్రబాబు… రాహుల్ వెంటపడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాన మోదీ ఫ్యాక్షనిస్ట్ అని, ఒక డిక్టేటర్ లా ఆయన వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
Next Story