Sat Aug 20 2022 00:04:43 GMT+0000 (Coordinated Universal Time)
హైదరాబాదీలకు గుడ్ న్యూస్ చెప్పిన కిషన్ రెడ్డి

హైదరాబాద్ లో రీజనల్ రింగ్ రోడ్లను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. ఈ మేరకు బీజేపీ నేతలు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. హైదరాబాద్ నగరానికి యాభై నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఈ రీజనల్ రింగ్ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. సుమారు ఇరవైకి పైగా పట్టణాలు, నగరాలను కలుపుతూ ఈ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుంది. తొలి దశలో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకూ 158 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం జరగనుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి దాదాపు పదివేల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని అంచనా వేశారన్నారు. రెండోదశలో చౌటుప్పల్ నుంచి చౌటుప్పల్ నుంచి సంగారెడ్డి వరకూ 182 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరగనుంది. రెండు రింగ్ రోడ్లకు దాదాపు పదిహేడు వేల కోట్లు ఖర్చుకానుంది.
Next Story