Fri Aug 19 2022 22:52:59 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్: హార్ధిక్ పాండ్యా, రాహుల్ కు భారీ ఊరట

కాఫీ విత్ కరణ్ షోలో మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసి సస్పెన్షన్ కు గురైన టీమిండియా ఆటగాళ్లు హార్ధిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ కు భారీ ఊరట లభించింది. వీరిపై సస్పెన్షన్ ను ఎత్తేస్తూ సీవోఏ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అయితే, వీరిపై విచారణ మాత్రం కొనసాగుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. మహిళలపై వీరిద్దరూ చేసి వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న వీరిద్దరినీ బీసీసీఐ సీవోఏ వెంటనే వెనక్కు పిలిచి సస్పెన్షన్ విధించింది. అయితే, వీరి భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని సస్పెన్షన్ ను ఎత్తేయాలని బీసీసీఐతో పాటు సీనియర్ ఆటగాళ్లు కూడా సీవోఏను కోరడంతో సస్పెన్షన్ ఎత్తివేశారు.
Next Story