Fri Jun 02 2023 07:24:56 GMT+0000 (Coordinated Universal Time)
బీజేపీ కోర్ కమిటీ సమావేశం.. అందుకేనా?
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. విశాఖలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము [more]
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. విశాఖలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము [more]

ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ కోర్ కమిటీ సమావేశం నేడు జరగనుంది. విశాఖలో జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో రామతీర్థం నుంచి కపిలతీర్థం వరకూ రథయాత్ర, తిరుపతి ఉప ఎన్నిక తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే పార్టీలో చేరికలపై కూడా సమావేశంలో చర్చించనున్నారు. ఉత్తరాంధ్రలో పలు కీలక నేతలు బీజేపీలో చేరేందుకు ఉత్సాహం చూపుతుండటాన్ని ఈ సందర్భంగా సోము వీర్రాజు కోర్ కమిటీ సభ్యుల దృష్టికి తేనున్నారు. దీంతో పాటు పార్టీ బలోపేతం పై కూడా చర్చించనున్నారు.
Next Story