కాంగ్రెస్ నేత, చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఎస్సై, కాన్సిస్టేబుల్ ను నిర్భిందించారనే కేసులో కొండా అరెస్టు తప్పదనుకున్నా చివరకు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైంది. దీంతో అరెస్టును నుంచి ఆయన బయటపడ్డారు. టీఆర్ఎస్ నుంచి చేవెళ్ల ఎంపీగా గెలిచిన కొండా తాజాగా కాంగ్రెస్ లో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేశారు. ఎన్నికల వేళ పోలీసులను నిర్భందించారని ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆయన నాంపల్లి కోర్టును అభ్యర్థించగా కోర్టు తిరస్కరించింది. పోలీసులు సైతం ఆయన కోసం గాలిస్తున్నారు. దీంతో కొండా హైకోర్టులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేశారు. ఆయనకు హైకోర్టు రూ.25 వేల పూచీకత్తుపై ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Mon May 23 2022 07:52:26 GMT+0000 (Coordinated Universal Time)