వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకున్న ఐఏఎస్
తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎస్ జోషిని కలసి వీఆర్ఎస్ కు అప్లై [more]
తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎస్ జోషిని కలసి వీఆర్ఎస్ కు అప్లై [more]

తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు సీఎస్ జోషిని కలసి వీఆర్ఎస్ కు అప్లై చేశారు. అయితే ఆయన గత కొంతకాలంగా ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. దళిత ఐఏఎస్ లకు అన్యాయం జరుగుతుందని ఆకునూరి మురళి ఆరపిస్తున్నారు. ఇప్పటికే దళిత ఐఏఎస్ లు కొందరు ప్రభుత్వం పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మురళి వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం చర్చనీయాంశమైంది. గతంలో భూపాల్ పల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు మురళి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గిరిజనులతో మాట్లాడుతూ అడవి పంది మాసం తినండి ఆరోగ్యంగా ఉంటారని వ్యాఖ్యలు చేయడం అప్పట్లో వైరల్ అయ్యాయి. మంచి ఐఏఎస్ అధికారిగా మురళికి పేరుంది.