కిడ్నాప్ చేసి…కోటి రూపాయలతో వదిలేసి
హైదరాబాదులో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో వ్యాపారవేత్త గజేంద్ర ప్రసాద్ ని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు తీసుకొని కిడ్నాపర్లు పారిపోయారు. ఆటో ఫైనాన్స్ [more]
హైదరాబాదులో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో వ్యాపారవేత్త గజేంద్ర ప్రసాద్ ని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు తీసుకొని కిడ్నాపర్లు పారిపోయారు. ఆటో ఫైనాన్స్ [more]

హైదరాబాదులో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం సృష్టించింది. అర్ధరాత్రి సమయంలో వ్యాపారవేత్త గజేంద్ర ప్రసాద్ ని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు తీసుకొని కిడ్నాపర్లు పారిపోయారు. ఆటో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న గజేంద్ర ప్రసాద్ ను అర్ధరాత్రి సమయంలో ఆరుగురు దుండగులు కలిసి కిడ్నాప్ చేశారు. తన మిత్రుడి కోసం దోమలగూడ లోని ఏవీ కాలేజీ వద్ద గజేంద్ర ప్రసాద్ వెయిట్ చేస్తుండగా, ఆరుగురు వ్యక్తులు ఒక్కసారిగా గజేంద్ర ప్రసాద్ పై దాడి చేసి ఎత్తుకొని పోయారు. కాళ్లు చేతులు విరిచేసి కళ్ళ కు గంతలు కట్టి తీసుకుపోయారు. “నిన్ను చంపేందుకు మాకు రెండు కోట్ల రూపాయల సుపారి ఇచ్చారు” అని కిడ్నాపర్లు గజేంద్ర ప్రసాద్ కు చెప్పారు. మూడు కోట్ల రూపాయలు ఇస్తే వదిలి వేస్తామని గజేంద్ర ప్రసాద్ కు చెప్పారు కిడ్నాపర్లు. తన దగ్గర అంత డబ్బు లేదని, కావాలంటే 20 నుంచి 30 లక్షలు ఇస్తానని గజేంద్ర ప్రసాద్ కిడ్నాప్ పలుకు వేడుకున్నాడు. గంట పాటు గజేంద్ర తో కిడ్నాపర్లు బేరసారాలు ఆడారు.. చివరకు కోటి రూపాయలు ఇచ్చినట్లు అయితే నిన్ను వదిలి వేస్తామంటూ కిడ్నాపర్లు చెప్పారు.. దీంతో గజేంద్ర ప్రసాద్ తన మిత్రుడైన రాహుల్ కాల్ చేసి కోటి రూపాయలు రెడీ చేయాలని కోరారు. గంటల వ్యవధిలో ఆబిడ్స్ కి గజేంద్ర ప్రసాద్ ను కిడ్నాపర్లు తీసుకువచ్చారు . అక్కడ అప్పటికే రాహుల్ డబ్బులతో రెడీగా ఉన్నాడు. అయితే సినిమా ఫక్కీలో రాహుల్ ని వదిలిపెట్టి డబ్బులు తీసుకుని వెళ్ళిపోయారు.దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.