Mon Aug 15 2022 04:49:17 GMT+0000 (Coordinated Universal Time)
ఓడిన ముగ్గురు అన్నలు... గెలిచిన ముగ్గురు తమ్ముళ్లు

తెలంగాణ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో బరిలో కోమటిరెడ్డి, పట్నం, మల్లు సోదరులు బరిలో నిలిచారు. నల్గొండ నుంచి అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఓడిపోగా, తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడులో విజయం సాధించారు. ఇక మల్లు సోదరుల్లో అన్న మల్లు రవి జడ్చర్లలో ఓటమిపాలవ్వగా, తమ్ముడు మల్లు భట్టివిక్రమార్క మధిరలో విజయం సాధించారు. ఇక టీఆర్ఎస్ లో తాండూరు నుంచి బరిలో ఉన్న పట్నం మహేందర్ రెడ్డి ఓడిపోగా, కొడంగల్ లో తమ్ముడు పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు.
Next Story