21.47 లక్షల కోట్ల బడ్జెట్

కేంద్రప్రభుత్వం 2017 బడ్జెట్ ను 21. 47 లక్షల కోట్లతో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పలు రంగాలకు అధిక నిధులను కేటాయించారు. అన్ని రంగాలను దృష్టిలో పెట్టుకుని ఈ బడ్జెట్ ను రూపొందించినట్లు కన్పిస్తోంది. మొత్తం బడ్జెట్ అంచనా విలువ 21. 47 లక్షల కోట్లగా అరుణ్ జైట్లీ చెప్పారు. ఇందులో రక్షణ రంగానికి 2.74 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. అలాగే డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడానికి కూడా అధిక నిధులను కేటాయించారు. బీమ్ యాప్ ప్రోత్సాహానికి రెండు కొత్త పథకాలను తీసుకొస్తున్నట్లు అరుణ్ ప్రకటించారు.
నగదు రహిత లావేదేవీలే లక్ష్యం...
సామాన్యుడికి ప్రయోజనం చేకూర్చేలా నగదు రహిత లావాదేవాలుంటాయని చెప్పిన జైట్లీ పెట్రోలు బంకులు, ఆస్పత్రుల్లో నగదు రహిత చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. 2,500 కోట్ల రూపాయల నగదు రహిత లావాదేవీల చెల్లింపు లక్ష్యంగా ముందుకు వెళుతున్నామన్నారు. ఆర్థిక నేరాలకు పాల్పడి దేశం విడిచి వెళ్లిన నేరగాళ్ల ఆస్తలను జప్తు చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకు రానున్నట్లు చెప్పారు. 2020 లోగా 20 లక్షల ఆధార్ ఆధారిత పీవోఎస్ యంత్రాలను తీసుకొస్తున్నామని చెప్పుకొచ్చారు జైట్లీ.
- Tags
- బడ్జెట్