సీఎస్ ఇంటిపై దాడుల్లో చిన్నమ్మ హస్తం?
తమిళనాడు సీఎస్ రామ్మోహనరావు ఇంటిపై ఐటీ దాడులు జరగడానికి కారణాలేంటి? చిన్నమ్మ శశికళ హస్తం ఉందంటున్నారు. రామ్మోహనరావు వద్ద లెక్కకు మించి ఆస్తులు ఉన్నట్లు శశికళే కేంద్రప్రభుత్వానికి సమాచారం చేరవేశారట. దీంతో రామ్మోహనరావు ఐటీ ఉచ్చులో చిక్కుకున్నారు.
శేఖర్ రెడ్డిపై కూడా...
శేఖర్ రెడ్డిపై ఐటీ దాడులు ఎందుకు జరిగాయి? శేఖర్ రెడ్డి కోట్ల ఆస్తులను ఎలా వెలికితీయగలిగారు? కోట్ల కొద్దీ నోట్ల కట్టలను...టన్నుల కొద్దీ బంగారాన్ని ఎలా స్వాధీనం చేసుకున్నారు ఐటి అధికారులు. అయితే ఓ ఆసక్తికరమైన విషయం తెలుస్తోంది. శేఖర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జయలలితకు సన్నిహితుడు. ఆయన చెన్నైలో అనేక బిజినెస్ లు చేసేవారు. జయ కూడా శేఖర్ రెడ్డి బిజినెస్ లో రహస్యంగా పెట్టుబడులు పెట్టారట. కోట్లాది రూపాయల జయ పెట్టుబడులను శేఖర్ రెడ్డి నాలుగింతలు చేశారని కూడా చెబుతున్నారు. అయితే జయ బతికున్నంత వరకూ ఆమెకె లెక్కలు తెలుసుకోవడం వరకే తప్ప శేఖర్ రెడ్డి నుంచి తన పెట్టుబడుల ద్వారా వచ్చిన లాభాలను తీసుకోలేదు. ఈ విషయాలన్నీ జయ ఇష్టసఖి శశికళకు తెలుసు.
లెక్కలు చెప్పకపోతేనే....
అయితే జయ మరణం తర్వాత పోయెస్ గార్డెన్ లో జయ ఆస్తుల లెక్కలు, పత్రాలను చిన్నమ్మ చూశారట. శేఖర్ రెడ్డిని పిలిపించుకుని జయ పెట్టుబడులపై ఆరా తీశారట. అయితే జయ మరణించింది కదా అని తన వద్ద పెట్టుబడులు కొంత మాత్రమే జయ పెట్టారని వాదనకు దిగారట శేఖర్ రెడ్డి. దీంతో చిన్నమ్మ కంగుతిన్నారట. వందల కోట్లు ఇవ్వాల్సిన వ్యక్తి జయ మరణించడంతో హ్యాండిస్తాడా? అని ఆగ్రహం వ్యక్తం చేశారట. దాంతో శశికళ, నటరాజన్ లుకలిసి కేంద్ర ప్రభుత్వానికి శేఖర్ రెడ్డి విషయాన్ని చెప్పారట. దీంతో శేఖర్ రెడ్డి ఐటీ ఉచ్చులో చిక్కుకున్నాడట. రామ్మోహన్ శేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు కావడం కూడా శశికళ ఆగ్రహానికి గురయ్యారట. సీఎస్ పై దాడులు కూడా చిన్నమ్మపనే అంటున్నారు తమిళతంబిలు.
- Tags
- శశికళ