వామ్మో ఒకటోతేదీ

పాతనోట్లు రద్దయి 52 రోజులు గడిచింది. ఇంకా 80 శాతం ఏటీఎంలు తెరుచుకోలేదు. కరెన్సీ నోట్ల కటకట తీరలేదు. సామాన్యులు గంటల తరబడి క్యూలైన్లో నిలుచున్నా రెండున్నర వేలకు మించి రావడం లేదు. ఇక ఒకటోతేదీ వస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంటి అద్దెలు, పాల బకాయి, కేబుల్ బిల్, విద్యుత్తు బిల్లు వంటి వాటిని చెల్లించేందుకు సొమ్ముల కోసం సొమ్మసిల్లేలా బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. మోడీ విధించిన గడువు కూడా ముగియడంతో జనం సొమ్ములు దొరుకుతాయేమోనని ఆశగా ఎదురు చూస్తున్నారు. కాని పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదు. ఇక చిల్లర సమస్య వేధిస్తోంది. ముఖ్యంగా చిరు వ్యాపారులు చిల్లర సమస్యతో వ్యాపారాలు లేక వీధిన పడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రజలకు అవసరమైన చిల్లరను అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు. రేపు మోడీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. నోట్ల రద్దు అంశాన్నే ఆయన ప్రస్తావించే అవకాశముంది.
- Tags
- పాతనోట్లు