Mon May 29 2023 18:23:32 GMT+0000 (Coordinated Universal Time)
భీమవరం రాజులు...గుంటూరు చౌదరీలేనా?

టీఎస్ ఐపాస్ పెట్టి సాధించిందేమీ లేదు. తెలంగాణ యువకులు ఇంకా నిరుద్యోగులుగానే ఉన్నారు. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా ఆంధ్ర యాసే కన్పిస్తుందన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్. ఇటీవల తాను పలు కంపెనీలకు వెళితే అక్కడ ఉద్యోగులందరూ ఆంధ్ర యాసలోనే మాట్లాడుతున్నారన్నారు. సెక్యూరిటీ గార్డు నుంచి ఉన్నత స్థాయిలో ఉన్నవారంతా ఆంధ్రావారేనా? మీకు భీమవరం రాజులు స్నేహితులు కావచ్చు. గుంటూరు చౌదరీలు మిత్రులు కావచ్చని కాని తెలంగాణ యువకులకు ఉద్యోగాలు లేకుంటే ఇంక రాష్ట్రం వచ్చి లాభమేంటని ప్రశ్నించారు ఎమ్మెల్యే సంపత్. సోమవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో టీఐపాస్ పై చర్చ సందర్భంగా సంపత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
- Tags
- టీఎస్ ఐపాస్
Next Story