భానుకిరణ్‌కు షాకిచ్చిన మోడీ
అనంతపురం ఫ్యాక్షన్ నాయకుడు మద్దెలచెరువు సూరి హత్య కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న భాను కిరణ్‌కు అనుచరులు షాక్ ఇచ్చారు. సూరి నీడలో బెదిరింపులు., దందాలతో కోట్లాది రుపాయల దండుకున్న భానుకిరణ్ తాను తీసిన గోతిలో తానే పడ్డాడట... ఏ సొమ్ము కోసమైతే., నమ్మిన సూరిని హతమార్చాడో అదే సొమ్మును అనుచరుల చేతిలో పెట్టి పోగొట్టుకున్నాడట భానుకిరణ్..... మద్దెల చెరువు సూరి హత్యతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల్లో భూదందాలు., కిరాయి హత్యలు., బెదిరింపుల అభియోగాలపై భానుకిరణ్ విచారణ ఎదుర్కొంటున్నాడు. పరిటాల రవి హత్యతో పెరిగిన సూరి ఇమేజ్ను అడ్డం పెట్టుకుని భానుకిరణ్ అడ్డగోలుగా సంపాదించాడు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సూరి పేరు చెప్పి సెటిల్మెంట్లు చేసేవాడు. చివరకు సూరి జైలు నుంచి విడుదలైన తర్వాత తనకు తెలియకుండా భానుకిరణ్ పెద్దఎత్తున సొమ్ము కూడబెట్టాడని తెలిసి వాటిని అప్పగించాలని ఒత్తిడి చేయడంతో సూరిని హతమార్చాడని పోలీసు రికార్డుల్లో నమోదైంది.
డంప్ ల్లో రూ.25 కోట్లు.....
దాదాపు ఐదేళ్లుగా చర్లపల్లి జైల్లో ఉంటున్న సూరి అక్కడి నుంచే తన అనుచరుల్ని నడిపిస్తున్నాడు. ఇటీవల నోట్ల రద్దు తర్వాత వివిధ ప్రాంతాల్లో దాచిపెట్టిన కోట్ల రుపాయల పాత డబ్బును మార్చుకోవాలని సూరి భావించాడు. ఇందుకోసం అత్యంత నమ్మకస్తులైన ఇద్దరు అనుచరులకు డంప్‌ల వివరాలు తెలిపి పాతనోట్లను మార్చే పని అప్పగించాడు. దాదాపు 25కోట్ల విలువైన నగదు అప్పగిస్తే వారిద్దరూ పత్తా లేకుండా పోయారట.... దీంతో జైల్లో లబోదిబోమంటున్న భానుకిరణ్ బెయిల్ కోసం శతవిధాల ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. బెయిల్ కోసం దర్యాప్తు చేస్తున్న అధికారులకు సైతం భారీ ఆఫర్ ఇచ్చినా వారు లొంగకపోవడంతో డబ్బులు పోగొట్టుకుని దిగులుపడ్డాడట. మొత్తానికి ఎవరు తీసిన గోతిలో వారే పడతారనడానికి భానుకిరణ్ ఉదంతం ఉదాహరణగా నిలుస్తోంది. భాను అనుచరుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.మొత్తానికి ప్రధాని మోడీ పెద్ద నోట్లను రద్దు చేసి ఇటు నల్లకుబేరులకే కాకుండా నేరగాళ్లకు కూడా బాగానే షాకిచ్చారన్నమాట.
- Tags
- భానుకిరణ్