పోలీసులకు ఎకనామిక్స్ తెలుసా?: విజయ్ మాల్యా

పోలీసు అధికారులకు ఎకనామిక్స్, వ్యాపారాల గురించి ఏం తెలుసని ప్రముఖ వ్యాపార వేత్త, ప్రస్తుతం విదేశాల్లో ఉంటున్న విజయమాల్యా విమర్శించారు. పోలీసులకు ఆర్థిక లావాదేవీల గురించి తెలియకుండానే తనపై తప్పుడు కేసులు పెడుతోందన్నారు విజయమాల్యా. అలాగే యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలను నన్ను ఒక ఆట ఆడుకుంటున్నాయన్నారు. తనను ఫుట్ బాల్ ఆడుకుంటున్నట్లు రెండు ప్రభుత్వాలు ఆడుకున్నాయని, ఆడుకుంటూనే ఉన్నాయని ఆయన ట్వీట్ చేశారు.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి ప్రస్తుతం యూకే లో ఉన్న విజయమాల్యాను భారత్ కు రప్పించడానికి అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. మాల్యా ఆస్తులను కూడా జప్తు చేశారు. అయితే మాల్యా మాత్రం బెదరకుండా ప్రభుత్వాలనే ప్రశ్నిస్తున్నారు. సీబీఐ కావాలనే తప్పుడు ఈ మెయిల్స్ ను బయటకు లీక్ చేసిందని మాల్యా ఆరోపిస్తున్నారు. మొత్తం మీద మాల్యా చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న సమయంలో ఆయన ట్వీట్లను చేయడం విశేషం. తనను అప్రదిష్ట పాలు చేయడానికే ప్రభుత్వం ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తుందన్నారు.
- Tags
- విజయ్ మాల్యా