పాస్‌పోర్ట్ అప్లికేషన్ నియమాలు సరళతరం
కొత్త పాస్‌పోర్ట్ అప్లై చేసుకునే వారికి, రిన్యూవల్ చేసుకునే వారికి శుభవార్త. పాస్‌పోర్ట్ కి అప్లై చేయడానికి మరియు రిన్యూవల్ కి సంభంధించిన నియమాలు మరింత సరళం చేస్తున్నట్లు విదేశాంగ శాఖ సహాయ మంత్రి శ్రీ వి.కె.సింగ్ చెప్పారు. పాస్‌పోర్ట్ నిభందనలు సులభం చేస్తున్నామని, దరఖాస్తు తో పాటు సమర్పించాల్సిన బర్త్ సర్టిఫికేట్ విషయం లో అనుమతించే పత్రాల జాబితా ను పెంచుతున్నామని ఆయన చెప్పారు. పాస్‌పోర్ట్ మరియు కాన్సులర్ సేవలు మరింత సులభం గాను త్వరితం గాను అందజేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి చెప్పారు. గత నలబై సంవత్సరాలలో మారిన అవసరాలను , మారుతున్న సామాజిక పరిస్థితులను దృస్టిలో ఉంచుకొని, అనేక మార్పులకు శ్రీకారం చుట్టామని శ్రీ సింగ్ చెప్పారు.
ప్రస్తుతం పాస్‌పోర్ట్ అప్లికేషన్ సేవలు పూర్తిగా ఆన్లైన్ లో అందుబాటులోకి వచ్చాయని, మరిన్ని మార్పులు తీసుకు రావడం ద్వారా అనేక అభివృద్ది చెందిన దేశాలలో అందే సేవలకు దీటుగా పాస్‌పోర్ట్ సేవలు అందిచటం కోసం అన్ని చర్యలు తీసుకోనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలో హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవాకేంద్రాల బ్రాంచ్ లను ఏర్పాటు చేయడానికి పైలట్ ప్రాజెక్ట్ ని విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రారంబిస్తున్నట్లు మంత్రి చెప్పారు.
కొత్త నియమాల ప్రకారం పుట్టినతేదీ నిర్దారణ కోసం, ఈ జాబితాలోని ఏ ద్రువపత్రన్నైన సమర్పించవచ్చు.
విదెంశాంగ శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమశాఖలకు చెందిన త్రిసభ్య కమిటీ సిఫార్సులమేరకు మరిన్ని మార్పులు చేయనున్నారు. ఈ మార్పుల్లో భాగంగా, తల్లి లేదా తండ్రి మాత్రమే ఉన్న పిల్లలకు పాస్‌పోర్ట్ అప్లికేషన్ లో న్యాయబద్దంగా పిల్లలు ఎవరి రక్షణ లో ఉంటే వారి పేరుతో అప్లై చేయవచ్చు. 1980 పాస్‌పోర్ట్ నియమాల ప్రకారం ఉన్న 15 అనుభందాలలో ఆరింటిని తొలిగిస్తున్నారు. ఆనెక్స్ A, C, D,E, J, K లను తొలిగిమ్చారు.అభ్యర్దులు సమర్పించాల్సిన అనుబందాలన్నీ ఎవరితో అటెస్ట్ చేయించాల్సిన అవసరం లేకుండ, సెల్ఫ్ డిక్లరేషన్ తో తెల్లకాగితం పై ఇవ్వచ్చు. వివాహితులైన అభ్యర్డులు అనుబందం K లేదా వివాహ ద్రువీకరణ పత్రం సమర్పించాల్సిన అవసరం ఉండదు. విడాకులు తీసుకున్న దంపతులైతే, విడాకుల డీక్రీ సమర్పించాల్సిన అవసరం కానీ, భర్త లేదా భార్య పేరు గాని నింపాల్సిన అవసరం కానీ లేదు. అనాదలైన పిల్లల అప్ప్లికేషన్ విషయంలో, బర్త్ సర్టిఫికేటు బదులుగా అనాధ సంస్థ ముఖ్య అదికారి డిక్లరేషన్ ఇవ్వవచ్చు. వివాహేతర సంబందాలలో జన్మించిన పిల్లలకైతే పాస్‌పోర్ట్ అప్లికేషన్‌తోపాటు అనుబందం G జతపర్సాల్సి ఉంటుంది. భారతదేశం లోపల దత్తత తీసుకున్న పిల్లల కు ఆడప్షన్ డీడ్ లేనట్లైతే, దత్తత తీసుకున్న వారి డిక్లరేషన్ ఇవ్వవచ్చు.
గుర్తింపు పత్రం (ఆనెక్స్ B) లేదా నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్(ఆనెక్స్- M) పొందలేని ప్రభుత్వ ఉద్యోగులు, అత్యవసరంగా పాస్‌పోర్ట్ పొందాల్సి వస్తే, వారి సంస్థ కు ముందే తెలియపర్చినట్లుగా స్వంత డిక్లరేషన్ సమర్పించవచ్చు. సాదువులు, సన్యాసులు వారి గురువుల పేరును తల్లి లేదా తండ్రి గా ఉపయోగిస్తూ ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డు సమర్పించాలి. ఈ మార్పుల్లో భాగంగా తాత్కాల్ పాస్‌పోర్ట్ సేవలకు నగదు పెమెంట్లను రానున్న రోజులలో నిలిపివేస్తారు. దీనీ స్టానంలో పాయింట్ ఆఫ్ సేల్ మెషీన్ లను స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ప్రవేశపెట్టనున్నట్లు, ఈ సమావేశంలో పాల్గొన్న చీఫ్ పాస్‌పోర్ట్ అదికారి అరుణ్ ఛటర్జీ చెప్పారు.
విశ్లేషణ: వినటానికి ఈ మార్పులన్నీ బాగున్నా, ఆచరణలో చాలా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం, దుర్వినియోగం అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మార్పు తప్పనిసరైనా అది సరైన దిశలో లేకుంటే, సమస్య మరింత జటిలం అవుతుంది. అబివృద్ది చెందిన దేశాల్లో, అన్ని స్తాయిల్లోనూ రికార్డులు సరిగ్గా నిర్వహిస్తారు కనుక అన్ని చోట్ల ఇన్ఫర్మేషన్ ఒకేలా ఉంటుంది కానీ ఇండియా లో ఇంకా ఆ పరిస్తితి లేదు. సంస్థాగతమైన అవినీతిని తొలిగించకుండా, నిబందనలు మార్చడం వల్ల, ప్రజలకు జరిగే మేలు కంటే అవినీతిపరులకు జరిగే మేలే ఎక్కువ. ఇండియా లో అవినీతి పరుల వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఎంత నిజమో విదేశాలలో ఉన్న మన కాన్సులేట్లలో ఉన్న ఉద్యోగుల అలసత్వం అంతే నిజం.
- Tags
- పాస్‌పోర్ట్