పాక్ కు ట్రంప్ షాక్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పాకిస్థాన్ పై పడింది. పాక్ కు షాకిచ్చేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు. ఏడు దేశాలకు చెందిన శరణార్థులు అమెరికాలోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా నిషేధిత దేశాల జాబితాలో ట్రంప్ పాకిస్థాన్ ను కూడా చేర్చే ప్రయత్నం చేస్తున్నారట. పాక్ ఉగ్రవాద దేశంగా ముద్రపడటం, అక్కడి ఉగ్ర కార్యకలాపాలకు పాక్ ప్రభుత్వం మద్దతివ్వడం వంటి అంశాలను ట్రంప్ వ్యతిరేకిస్తున్నారు. పాక్ లోనే ఉగ్రవాదం వేళ్లూనుకుని ప్రపంచ దేశాలను భయకంపితులను చేస్తున్నారని, పాక్ ను ఉగ్రవాద దేశంగా ప్రకటించాలని భారత్ ఎప్పటి నుంచో కోరుతున్న సంగతి తెలిసిందే.
పాకిస్థాన్ కు వెళ్లి శిక్షణ పొంది వచ్చిన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకూ పాల్పడుతున్నారు. అందుకే పాక్ కు వెళ్లి వచ్చిన వారిని ఇకపై క్షుణ్ణంగా పరిశీలించాలన్న నిర్ణయం తీసుకోనున్నారు. వారికి అమెరికా పౌరసత్వం కూడా లభించే అవకాశం లేదట. దీంతో పాక్ పైకూడా ఆంక్షలు విధించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారని వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ట్రంప్ నిర్ణయం వెలువడితే పాక్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.