పవన్ వెంట మెగా హీరోలు

ఏపీలో జరగబోతున్న ప్రత్యేక హోదా ఉద్యమానికి టాలివుడ్ హీరోలు ఒక్కొక్కరిగా మద్దతు తెలుపుతున్నారు. నిరసనకు తమ సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు ఉద్యమానికి మద్దతుగా ట్వీట్ చేశారు. హీరో నిఖిల్ సైతం ప్రత్యేక హోదా ఉద్యమానికి బాసటగా నిలుస్తానని ప్రకటించారు. ఇక మరో హీరో సందీప్ కిషన్ అయితే ఏకంగా 26వ తేదీన ఆర్కే బీచ్ లో జరిగే నిరసన కార్యక్రమంలో భాగస్వామినవుతానని ప్రకటించారు. మౌన ప్రదర్శనలో తాను పాల్గొని రాష్ట్రానికి చేతనైంత సాయపడతానని ట్వీట్ చేశారు. పవర్ స్టార్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రత్యేక హోదా ఉద్యమానికి మద్దతు పలకడంతో ఒక్కొక్కరూ తమ అభిప్రాయాలను ట్వీట్ చేస్తూ వస్తున్నారు.
ఆర్కే బీచ్ లో ప్రత్యేక హోదా నిరసనకు అనుమతించేది లేదంటూ ఏపీ డీజీపీ చేసిన ప్రకటనపై పవన్ స్పందించారు. రాష్ట్రం కోసం...ఒక ప్రత్యేక కారణం కోసం చేస్తున్న శాంతియుత నిరసనకు ప్రభుత్వం అనుమతివ్వాలని పవన్ కోరారు. ప్రత్యేక హోదా ప్రజల హక్కని, ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు ప్రభుత్వాలు ప్రయత్నించాలని పవన్ ట్వీట్ చేశారు.
- Tags
- పవన్ కల్యాణ్