పవన్ నే ఈయన ఎందుకు టార్గెట్ చేశారు?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మీద మరోనేత మాటల దాడికి దిగారు. నిన్న తమ్మారెడ్డి భరద్వాజ పవన్ పోకడను విమర్శిస్తే ఈరోజు కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కూడా పవన్ ను టార్గెట్ చేసుకుని మాట్లాడారు. ట్వీట్లు, సభలు పెట్టడం వల్లే ప్రత్యేక హోదా వస్తుందనుకోవడం భ్రమే అని పవన్ పేరును ప్రస్తావించకుండా పరోక్షంగా సెటైర్లు వేశారు. ముద్రగడ విలేకర్లతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని సమిష్టిగా నిర్వహించాలన్నారు.
అందరూ ఒకే గొడుకు కిందకు...
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తామంటున్న రాజకీయనేతలు, వ్యక్తులు అందరూ కలిసి పోరాటం చేయాలని పిలుపు నిచ్చారు. అప్పుడే తాను కూడా ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగస్వామినవుతానని చెప్పారు. ఒకే గొడుకు కిందకు అన్ని రాజకీయ పార్టీలు వచ్చినప్పుడే ఉద్యమాన్ని ఉధృతంగా చేసి ప్రత్యేక హోదాను సాధించుకోవచ్చన్నారు ముద్రగడ. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రాకుంటే యువత తీవ్రంగా నష్టపోయే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాలని చంద్రబాబుతో సహా అన్ని రాజకీయ పార్టీలు, చిరంజీవి, పవన్ కల్యాణ్ మరికొందరు సెలబ్రిటీలకు కూడా తాను లేఖలు రాశానని చెప్పారు. సంప్రదాయ క్రీడ జల్లికట్టును ఉద్యమంగా సాధించుకున్న తమిళనాడును చూసైనా మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు ముద్రగడ.
- Tags
- పవన్ నే టార్గెట్