Mon May 29 2023 18:08:52 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరులో బాణా సంచా పేలుడు: 10 మంది మృతి

నెల్లూరులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెను విషాదం సంభవించింది. ఫైర్ వర్క్స్ ఫ్యాక్టరీలో పేలుడు జరిగి పది మంది మృత్యువాత పడ్డారు. నెల్లూరుకు అతి సమీపంో ఉన్న పొరుకట్లలో ఈ సంఘటన జరిగింది. మరో పదిమంది క్షతగాత్రులై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది కూడా చాలా సేపటి వరకూ మంటలను అదుపులోకి తేలేకపోయారు. మృతుల శరీరాలు గుర్తు పట్టలేని విధంగా తయారయ్యాయి.
- Tags
- నెల్లూరు
Next Story