టెక్ ఇండియా మా నినాదం : జైట్లీ

పరిపాలనలో పారదర్శకత తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని అరుణ్ జైట్లీ చెప్పారు. ఈ ఏడాదే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కోలుకునే అవకాశముందని ఆయన అబిప్రాయ పడ్డారు. లోక్ సభలో బడ్జెట్ప్ ను ప్రవేశపెట్టిన జైట్లీ పలు అంశాలను తన ప్రసంగంలో ప్రస్తావించారు. అభివృద్ధి ఫలాలను అందరికీ అందించాలన్నదే తమ లక్ష్యమన్న జైట్లీ యువత ఆకాంక్షలు నెరవేర్చేలా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. 2017లో ఆర్థికాభివృద్ధి పెరిగే అవకాశం ఉందన్న ఆర్థిక మంత్రి నోట్ల రద్దు వల్ల దీర్ఘకాలిక ప్రయోజనాలున్నాయన్నారు . ద్రవ్యోల్బణం తగ్గించగలిగామని, జీడీపీని పెంచగలిగామని ఆయన తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. నోట్ల రద్దుతో నల్ల ధనాన్ని అరికట్టగలుగుతున్నామన్న జైట్లీ దానివల్ల బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించగలిగామని చెప్పారు. బడ్జెట్ లో అధికభాగం గ్రామీణ, పేదరికం, మౌలిక వసతులపై ఖర్చు పెడతామని చెప్పారు. టెక్ ఇండియా నినాదంతో భారత్ ను అగ్రపథంలో నిలుపుతామన్నారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం...
ఐదేళ్ల లోపు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న జైట్లీ రైతులకు పది లక్షల కోట్ల రూపాయల రుణాలను అందిస్తామని చెప్పారు. ఎఫ్ డీఐ నిబంధనలను సరళీకరించామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఈ బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల విభజన ఉండదని చెప్పారు. నిజాయితీగా పన్నులు చెల్లించే వారికి వేధింపులుండవన్న జైట్లీ పన్నులు చెల్లించకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. వ్యవసాయ రంగం ఈ సంవత్సరం 4.1 శాతం వృద్ధి చెందుతుందని జైట్లీ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచబ్యాంకు, ఐఎంఎఫ్ లు కూడా జీడీపీ పెరుగుతుందని సూచించాయన్నారు. పది కీలక అంశఆలపై ఈ బడ్జెట్ దృష్ఠి పెట్టిందన్నారు. టెక్ ఇండియా అనేది తమ ప్రభుత్వ నినాదంగా జైట్లీ వెల్లడించారు. 2017-2018 సంవత్సరంలో ఆర్థికాభివృద్ధి 7.2 నుంచి 7.7 శాతానికి పెరుగుతుందని చెప్పారు.
- Tags
- అరుణ్ జైట్లీ