Tue Jun 06 2023 19:53:31 GMT+0000 (Coordinated Universal Time)
టార్గెట్ చైనా

చైనా లక్ష్యంగా భారత్ దూకుడు పెంచింది. పూర్తిగా స్వదేశీ పరిజ్నానంతో తయారు చేసిన అగ్ని-5ను సోమవారం పరీక్షించారు. చైనాతో ఎప్పటికైనా ప్రమాదమని గ్రహించిన భారత్ ముందస్తు చర్యగా అత్యాధునిక సాంకేతిక పరిజ్నానంతో అగ్ని-5ను రూపొందించింది. గతంలో జరిపిన మూడు పరీక్షలు విజయవంతమయ్యాయి. తాజాగా నాలుగో సారి సోమవారం పరీక్ష నిర్వహించారు. పరీక్ష ఫలితాలు ఇంకా వెల్లడించలేదు. 1500 కిలోల అణ్వస్త్రాలను సులువుగా మోసకెళ్లగలుగుతోంది ఈ అగ్ని. అగ్ని 17 మీటర్ల పొడవు. 50 టన్నుల బరువు ఉంటుంది. ఈ క్షిపణి 5 వేల నుంచి ఆరు వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని చేరగలదు. ఉత్తర చైనాలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకుంటుంది అగ్ని. ఈ క్షిపణిని డీఆర్డీవో రూపొందించింది. ఒడిషాలోని వీలర్ ఐలాండ్ లో జరిగిన ఈ పరీక్ష విజయవంతమైతే భారత్ అణ్వస్త్ర పొదిలో మరో అస్త్రం చేరినట్లే.
- Tags
- అగ్ని-5
Next Story