జాన్ ఎఫ్. కెనడీ ఎయిర్ పోర్ట్ లో ఏం జరుగుతోంది?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. న్యూయార్క్ లోని జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయంలో ఆందోళనకారులు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఏడు దేశాల శరణార్ధులపై ట్రంప్ ఆంక్షలు విధించడంతో అమెరికన్ పోలీసులు వారిని ఎయిర్ పోర్టులోనే అడ్డుకుంటున్నారు. జాన్ ఎఫ్ కెనడీ విమానాశ్రయంలో ఆదివారం కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. విమానాశ్రయంలోని టెర్మినల్ కు వెళ్లే రహదారులన్నింటినీ మూసివేశారు.
ట్రంప్ ఆదేశాలను తూచా తప్పకుండా వెంటనే అమలు చేయడంతో ముస్లిం శరణార్థులు ఇబ్బందిపడుతున్నారు. వారు ప్రయాణంలోనే ఉండగానే ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని చెప్పి అన్ని రకాల అనుమతులకు సంబంధించిన పత్రాలను చూపిస్తున్నా పోలీసులు వారిని దేశంలోకి అనుమతించడం లేదు. దీంతో అనేకమంది శరణార్థులకు మద్దతుగా వేల సంఖ్యలో ఆందోళనకు దిగారు. మొత్తం మీద ట్రంప్ తన నిర్ణయాలతో అమెకాలో తీవ్ర నిరసనలనే ఎదుర్కొంటున్నారు.