జగన్ పై కేసు నమోదుకు రంగం సిద్ధం..?

మినుమ పంట పొలాలను పరిశీలించేందుకు వచ్చి తన పొలాన్ని నాశనం చేశారంటూ హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో వైఎస్ జగన్ పై ఫిర్యాదు చేసారు. కృష్ణా జిల్లా కాకుమాను గ్రామానికి చెందిన జోగి శేషగిరిరావు తన పొలాన్ని నాశనం చేసినందుకు, వైఎస్ జగన్, గన్నవరం వైసీపీ ఇన్ చార్జి దుట్టా రామచంద్రరావుల పై కేసు నమోదు చేయాలని ఎఫ్ఐఆర్ లో కాకుమాను గ్రామస్థులు పెర్కోన్నారు.జగన్ పై కేసు నమోదు చేసేందుకు న్యాయ సలహా తీసుకుంటున్నట్లు హనుమాన్ జంక్షన్ పోలీసులు తెలిపారు.
నీరందక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించేందుకు జగన్ కృష్ణా జిల్లా కాకులపాడుకు వెళ్లారు. అక్కడి రైతులను పరామర్శించారు. ఎండిపోయిన పంటలను పరిశీలించారు. అయితే తన అనుమతి లేకుండా తన పొలంలో సభ పెట్టారంటూ రైతులు ఫిర్యాదు చేశారు. దీనిపై వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్ష నేతను ప్రభుత్వం ఇబ్బందిపెట్టాలని చూస్తోంందని, జగన్ పై తప్పుడు కేసులు నమోదు చేస్తే ఊరుకునేధి లేదని వైసీపీ నేతలు హెచ్చిస్తున్నారు.
- Tags
- జగన్