చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైఎస్ జగన్
సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని., చంద్ర బాబుకి ప్రచారంలో ఉన్న యావ పెండింగ్ పనులు పూర్తి చేయడంలో లేదని జగన్ ఆరోపించారు. తక్షణమే మనుగడలోకి వచ్చే ప్రాజెక్టులను సైతం విస్మరిస్తున్నారని ., అవకాశం ఉన్నా నీరు నిల్వ చేసుకోలేని దుస్థితి.., కమీషన్లు వచ్చే పనులు మినహా శాశ్వత ప్రయోజనం చేకూరే పనులకు ప్రాధాన్యత దక్కడం లేదని మండి పడ్డారు. ఏనాడో తుది దశకు వచ్చిన ప్రాజెక్టులను సైతం తానే చేపట్టినట్లుగా గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. సాగు నీటి ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా జగన్ ఎ వై ఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం లోని పైడిపాలెం ప్రాజెక్టును సందర్శించి, పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత సోది. ., అబద్ధాలు... దుర్మార్గమే కన్పిస్తోంది'' అని విరుచుకుపడ్డారు. పైడిపాలెం ప్రాజెక్టుకు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.668 కోట్లు ఖర్చు పెట్టగా.. చంద్రబాబు మూడేళ్లలో రూ.24కోట్లు ఖర్చు పెట్టారని తెలిపారు. వైఎస్ హయాంలోనే ప్రాజెక్టు పూర్తయితే ఇప్పుడు లస్కర్ లా గేట్లెత్తి మొత్తం తానే చేసినట్లు చెప్పుకున్నారని దుయ్య బట్టారు.
మూడేళ్లుగా పూర్తికాని పెండింగ్ పనులు...:
పైడిపాలెం రిజర్వాయర్ సామర్థ్యం ఆరు టీఎంసీలు అయితే ప్రస్తుతం కేవలం 0.67టీఎంసీల నీరు నిల్వ ఉందని అందులో 0.2 టీఎంసీ డెడ్‌స్టోరేజీ పోను 0.5 టీఎంసీ లు మాత్రమే ఇవ్వగలుగుతున్నామన్నారు. గాలేరి- నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగమైన గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీలు నిల్వ చేయవచ్చని., 22 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో నిర్మించిన వరద కాలువ 80 శాతం పనులు పూర్తయ్యాయి. పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు 80% పూర్తయ్యాయని చెప్పారు.. మిగిలిన 20% పనులను చంద్రబాబు మూడేళ్లుగా పూర్తి చేయలేకపోవడంతో నీరు వాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. గండికోటలో 26 టీఎంసీలు నిల్వ చేసి ఉంటే పైడిపాలెంకు ఆరు టీఎంసీలు, చిత్రావతిలో 10 టీఎంసీలు, సర్వరాయసాగర్‌లో 3.2 టీఎంసీలు, వామికొండలో 1.6 టీఎంసీలు నిల్వ చేసి ఉండవచ్చని చెప్పారు. పనులు పూర్తై ఉంటే మైలవరం ప్రాజెక్టు సైతం స్థిరీకరించి ఉండవచ్చు. కానీ చంద్రబాబు మిగిలిపోయిన 20 శాతం పనులు పూర్తి చేయకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.. ప్రచారం చేసుకోవడం మినహా ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి లేదని., రాయలసీమ కోసమే పట్టిసీమ నిర్మించానని చంద్రబాబు డబ్బాలు కొడుతున్నారని పట్టిసీమ నుంచి 45 టీఎంసీల నీరు వస్తే ప్రకాశం బ్యారేజ్ నుంచి 55 టీఎంసీలు సముద్రంలో కలవడం కనిపించడం లేదా అని అడిగారు. పోలవరం పూర్తయి ఉంటే ఆ నీరు అందులో నిల్వ చేసుకునేవాళ్లమని కానీ పోలవరాన్ని కాదని కమీషన్ల కోసమే పట్టిసీమ కట్టారని ఆరోపించారు.చంద్రబాబు కొందరు కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే జీఓలు జారీ చేస్తున్నారని దుయ్య బట్టారు.
కమీషన్ల కోసమే...:
పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తే నీరు నిల్వ ఉంటుందని తెలిసినా కమీషన్లకోసం చంద్రబాబు తాత్కాలిక ప్రాజెక్టులకే ప్రాధాన్యమిస్తున్నారు. టెండరు మొత్తం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. పట్టిసీమ , పురుషోత్తపట్నం ఎత్తిపోతలను కమీషన్ల కోసమే చేపట్టారు. దీనికి సీబీఐ విచారణ అవసరం లేదు... సింగిల్ పోలీసు విచారణ చేపట్టినా లంచాల కోసం ఏ విధంగా చంద్రబాబు వ్యవహరించారో తెలుస్తుంది. రైతులకు ఉపయోగపడే పనులను చేస్తే హర్షిస్తాం... కమీషన్ల కోసం కక్కుర్తిపడే పనులను వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు కాంట్రాక్టర్లను ప్రోత్సహిస్తున్న తీరును తప్పు పడుతున్నాం.
చంద్రన్న బీమా పచ్చి దగా..:
''ముఖ్యమంత్రి చంద్రబాబు తన పేరుపై చంద్రన్న బీమా పథకం ప్రవేశ పెట్టారు. ఆ పథకం గురించి పెద్ద ఎత్తున హోర్డింగ్‌లు పెట్టి భారీగా ప్రచారం చేశారు. కానీ ప్రయోజనం శూన్యం. చంద్రన్న బీమా పథకం పచ్చి మోసం... ప్రయోజనం శూన్యం. 40 రోజుల వుతున్నా బాధితులను ఆదుకోలేదు'' అని జగన్ ధ్వజమెత్తారు. ఆర్టీసీ బస్సు ఢీకొని తొండూరు మండలం కోరవానిపల్లెకు చెందిన ముగ్గురు గొర్రెల కాపరులు, 150 గొర్రెలు చనిపోతే పరిహారం అందించలేదని చెప్పారు
- Tags
- జగన్