Sun May 28 2023 09:27:18 GMT+0000 (Coordinated Universal Time)
కాకాణివి కాకమ్మ కబుర్లే

వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఏపీ డీజీపీని కలిశారు టిడిపి సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. తనపై కాకాణి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కాకాణి చెబుతున్నవన్నీ కాకమ్మ కబుర్లేనని....నకిలి పత్రాలు సృష్టించి తన ప్రతిష్టకు భంగం తెస్తున్నారని సోమిరెడ్డి డీజీపీ సాంబశివరావు దృష్టికి తీసుకొచ్చారు. నకిలీ దస్తావేజులు సృష్టించి...దానిపై సీబీఐకి ఫిర్యాదు చేశారన్నారు. కాకాణిపై ఇప్పటికే నకిలీ మద్యం కేసులు ఆరు ఉన్నాయని, వాటిపై విచారణ చేయాలని సోమిరెడ్డి కోరారు. కాకాణి వంటి నేతలతో నిజాయితీగా రాజకీయాలు చేసే వారికి ప్రమాదమేనని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తాను తప్పు చేస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని సోమిరెడ్డి స్పష్టం చేశారు.
- Tags
- కాకాణి
Next Story