ఏంది బాపూ ఈ....పని?

ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. బాపూ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తప్పుడు వైద్య ధృవీకరణ పత్రాలు సమర్పించినందున లక్ష రూపాయలు జరిమానా కూడా విధించింది. దీంతో బెయిల్ పై బాపూ పెట్టుకున్న ఆశలు అడియాసలే అయ్యాయి. ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపూ అత్యాచారం కేసులో అరెస్టయి 2003 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. తన ఆశ్రమంలో ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని ఆశారాంపై కేసు నమోదయింది. అయితే ఆతర్వాత అనేక సార్లు బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. తనకు మగతనం లేదని కూడా ఆశారాం బాపు ఒకసారి వాదించారు. ఇప్పటికి బాపూ పెట్టుకున్న పిటిషన్లను ఏడుసార్లు సుప్రీంకోర్టు కొట్టేసింది.
తనకు తరచూ కడుపు నొప్పి వస్తుందని ఆశారాం బాపూ వైద్య ధృవీకరణ పత్రాలను జత చేసి బెయిల్ కు దరఖాస్తు చేసుకున్నారు. కాని సుప్రీంకోర్టు ఈసారి కూడా బెయిల్ తిరస్కరించింది. పైగా మెడికల్ సర్టిఫికేట్స్ తప్పుడువతని తేలడంతో ఆశారాంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. లక్ష రూపాయలు జరిమానా విధించడమే కాకుండా ఫోర్జరీ కేసు, కోర్టును తప్పుదోవ పట్టించారన్న దానిపై కేసులు పెట్టాలని పోలీసులను ఆదేశించింది.
- Tags
- ఆశారాం బాపూ