అమెరికాలో మళ్లీ దారుణం

అమెరికాలో మరో భారతీయ సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దక్షిణ కరోలినాలో జరిగిన ఈ సంఘటనతో అమెరికాలో ఉంటున్న భారతీయ సంతతి ప్రజలు భయపడి పోతున్నారు. హర్నీష్ పటేల్ వ్యాపారవేత్త. ఆయన తన ఇంటి బయట ఉండగా గుర్తు తెలియని దుండగులు వచ్చి కాల్చి చంపారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో ఈ హత్య జరిగినట్లు సమాచారం. హర్నీశ్ పటేల్ గుజరాత్ కు చెందిన వ్యాపారి.
హర్నీష్ పటేల్ పై కాల్పులు...
హర్నీష్ పటేల్ కుటుంబం లాంకస్టెర్ లో సొంత ఇంటిలో నివాసముంటుంది. గుర్తుతెలియని దుండుగుల వచ్చి ఒక్కసారిగా పటేల్ పై కాల్పుల జరపడంతో ఆయన అక్కడికిక్కడే మృతి చెందారు. కాల్పులకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అమెరికాలో ఇటీవలే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ మృతి మరిచి పోకముందే మరో భారతీయ సంతతి వ్యక్తిపై కాల్పులు జరపడం ఆందోళన కల్గిస్తోంది. అయితే పటేల్ హత్య జాతి విధ్వేషాల కారణగా జరగిందా? లేక మరైదైనా కారణం ఉందా? అన్నది పోలీసు విచారణలో వెల్లడవుతుంది. పటేల్ పై కాల్పుల ఘటనతో అమెరికాలోని తెలుగు వారు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎప్పుడు కాల్పుల మోత విన్పిస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంంది.