అమరావతికి అసెంబ్లీ ఉద్యోగులు
అసెంబ్లీ ఉద్యోగులు హైద్రాబాద్ నుంచి అమరావతిలో విధులు నిర్వహించేందుకు రంగం సిద్దం అయింది.... ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో ఏపీ నుంచే అసెంబ్లీ ఉద్యోగులు పని చేయనున్నారు.....మహిళా పార్లమెంట్ సదస్సు మొదలయ్యే ముందేఉద్యోగులను ఏపీకి పంపించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది..
హైదరాబాద్ లోనే విధులు...
ఏపీ నుంచి పాలన పూర్తి స్థాయిలో మొదలైనా అసెంబ్లీ ఉద్యోగులు మాత్రం ఇంకా హైద్రాబాద్ లోనే ఉన్నారు..రెండున్నరేళ్ల పాలనలో అసెంబ్లీ సమావేశాలు హైద్రాబాద్ లోనే జరగడంతో వీరిని కొత్త రాజధానికి రప్పించడం ఆలస్యం అయింది...వీరి విభజన జరిగిన తీరు కూడా కొంత ఇబ్బందిగానే మారింది..తెలంగాణా అసెంబ్లీ ఉద్యోగులను కొంత మందిని ఏపీకి కేటాయించడం వారు కొంత ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించడం కూడా జరిగాయి..అయితే వారిని తిరిగి తెలంగాణా కు కేటాయించడంతో ఈ అంశానికి తెరపడింది..ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ ఉద్యోగులను అమరావతి నుంచి విధులు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది..దీనికి సంబంధించి ఇప్పటికే స్పీకర్ సమీక్ష పూర్తి చేయడం ఉద్యోగులను మానసికంగా సిద్దం చేయడం కూడా జరిగిపోయాయి.
నిర్మాణానికి నెల రోజులు
సీఎం చంద్రబాబు గత అసెంబ్లీ సమావేశాల్లో ఇవే చివరి సమావేశాలు అని ప్రకటించారు...అయితే ఆ తర్వాత మళ్లీ శీతాకాల సమావేశాలు హైద్రాబాద్ లోనే నిర్వహిద్దామని ప్రభుత్వం ప్లాన్ చేసింది..కానీ ఒకసారి సీఎం చివరి సమావేశాలు అని ప్రకటించడంతో మళ్లీ నిర్వహిస్తే మంచిది కాదనే ఉద్దేశంతో ఇక హైద్రాబాద్ లో ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ఫుల్ స్టాప్ పెట్టేసారు.....ప్రస్తుతం అమరావతిలో అసెంబ్లీ భవన నిర్మాణాలు కూడా ఇంకా పూర్తి కాలేదు...ఇవి పూర్తి అయ్యేందుకు మరో నెల రోజులు పైగానే పట్టే అవకాశం కనిపిస్తోంది.....అసెంబ్లీ ఉద్యోగులు కూడా నెల రోజుల్లోపే అమరావతికి వెళ్లిపోనున్నారు....దీంతో ఇక ఏపీ అసెంబ్లీ పూర్తి స్థాయిలో అమరావతి నుంచి పనిచేయనుంది..
సదస్సు కోసమే....
అన్నింటి కంటే ముఖ్యంగా వచ్చే నెల 10 నుంచి మూడు రోజుల పాటు మహిళా పార్లమెంట్ సమావేశాలు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది.....దీనికి సంబంధించి కమిటీలు కూడా పని చేస్తున్నాయి.వీటిని దృష్టిలో పెట్టుకుని అసెంబ్లీ ఉద్యోగులు పూర్తి స్థాయిలో అమరావతిలో ఉండే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది...ఏపీ ప్రభుత్వం, అసెంబ్లీ కలిసి సంయుక్తంగా ఈ మహిళా పార్లమెంట్ నిర్వహిస్తోంది...దీంతో అసెంబ్లీ అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ...అసెంబ్లీ అధికారులు, ఉద్యోగులు ఇప్పటికే ఈ మహిళా పార్లమెంట్ పై ప్రత్యేకంగా సమావేశం అయ్యారు కూడా.....దీంతో ఈ సమావేశాలు మొదలయ్యే లోపే అసెంబ్లీ ఉద్యోగులు అమరావతి వెళ్లనున్నారు.
వసతి కష్టమే...
ఏపీ అసెంబ్లీలో 120 మంది ఉద్యోగులు అన్ని స్థాయిల్లో విధులు నిర్వహిస్తున్నారు....ప్రస్తుతం వీరికి అమరావతిలో వసతి సౌకర్యానికి సంబంధించి కొంత ఇబ్బంది ఏర్పడే అవకాశం ఉంది...అయితే ప్రస్తుతం అమరావతిలో పని చేస్తున్న పురుష, మహిళా ఉద్యోగులకు ప్రభుత్వం వసతి సౌకర్యం కల్పిస్తోంది.దీంతో అసెంబ్లీ ఉద్యోగులు కూడా తమకు వసతి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు....దీనిపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి..మొత్తానికి అసెంబ్లీ ఉద్యోగులు మరో నెల రోజుల్లో కొత్త రాజధాని అమరావతి నుంచి విధులు నిర్వహించనున్నారు.
- Tags
- అమరావతి