Mon Oct 14 2024 05:02:45 GMT+0000 (Coordinated Universal Time)
Konda Surekha : కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ సంచలన కామెంట్స్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు. నాగ చైతన్య సమంత విడాకులకు కారణం కేటీఆర్ అని తీవ్రంగా స్పందించారు. హీరోయిన్లకు మత్తు పదార్థాలను అలవాటు చేసింది కూడా కేటీఆర్ అని కొండా సురేఖ అన్నారు. అనేక మంది సినీ పరిశ్రమలో విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అని అన్నారు.
హీరోయిన్ల ఫోన్లన్నింటినీ...
హీరోయిన్ల ఫోన్లన్నింటినీ ట్యాప్ చేయించింది కేటీఆర్ అని అన్నారు. హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారని కొండా సురేఖ విమర్శలు చేశారు. తనపై సోషల్ మీడియాలో మూడు అకౌంట్ల ద్వారా దుబాయ్ నుంచి వేర్వేరు నెంబర్లతో ట్రోలింగ్ చేశారన్నారు. తనవి దొంగ ఏడుపులు అన్న కేటీఆర్ నీ ఇంట్లో మహిళలను అంటే తట్టుకుంటారా? ప్రశ్నించారు. కొండాసురేఖపై జరిగిన ట్రోలింగ్ కు నిరసన తెలుపుతూ బీఆర్ఎస్ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. ఈ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది.
Next Story