Wed Feb 12 2025 07:35:55 GMT+0000 (Coordinated Universal Time)
అందరూ పాస్.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందరిని పాస్ చేసేలా నిర్ణయం తీసుకుంది.

ఇంటర్ ఫస్టియర్ ఫలితాలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందరికి మినిమమ్ మార్క్స్ ఇచ్చి పాస్ చేసేలా నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్టియర్ లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. వీరంతా ప్రభుత్వ కళాశాలల్లో చదువుకున్న వారే. కరోనా కారణంగా ఆన్ లైన్ లోనే ఎక్కువగా గత ఏడాది విద్యాబోధన జరిగింది. దీనిపై విద్యాశాఖ మంత్రి సబిగా ఇంద్రారెడ్డి స్పందించారు. కోవిడ్ సమయంలో టెన్త్, ఇంటర్ విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేశామని ఆమె తెలిపారు.
ఇంటర్ ఫస్టియర్....
డిజిటల్ క్లాసులు, దూరదర్శన్ ద్వారా విద్యాబోధన చేశామని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. సబ్జెక్ట్ ను వెబ్ సైట్ లలో కూడా పెట్టామన్నారు. పరీక్షల సమయంలో విద్యార్థులకు కౌన్సెలింగ్ కూడా ఇచ్చామని చెప్పారు. ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ఇంటర్మీడియట్ బోర్డుపై విపక్షాలు విమర్శలు చేయడం సరికాదన్నారు. పిల్లలపై ప్రభుత్వానికి ఎటువంటి కోపం ఉండదన్నారు. 30 మార్కులు ఇచ్చినా కేవలం 80 వేల మందే పాస్ అవుతున్నారని, అందుకే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరినీ పాస్ చేసేలా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. అందరినీ పాస్ చేయడం ఇదే చివరిసారి అని మంత్రి తెలిపారు. ధర్నాలు చేస్తే మరోసారి పాస్ చేయబోమని ఆమె తెలిపారు.
Next Story