Thu Mar 12 2026 19:08:50 GMT+0530 (India Standard Time)
Kavitha : సీబీఐ సమన్లపై కవిత ఏమన్నారంటే?
ఢిల్లీ మద్యం కేసులో సమన్లు ఇవ్వడం పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు

ఢిల్లీ మద్యం కేసులో సమన్లు ఇవ్వడం పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. ఈ మేరకు ఎక్స్ లో ఆమె ప్రకటన చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో చార్జెస్ ఫ్రేమ్ చేయడానికి కూడా రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ కేసును కొట్టేసిన విషయం మీ అందరికీ తెలిసిందేనని, కేసు కొట్టేయడంతో పాటు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ను సైతం ఎంక్వయిరీ చేయాలని సైతం రౌస్ అవెన్యూ కోర్టు కామెంట్ చేసిన విషయమూ మీ అవగాహనలో ఉందని కవిత ఎక్స్ లో పేర్కొన్నారు.
సత్యం తనకు తోడుగా...
రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు పై సీబీఐ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిందని, ఈ కేసు విచారణ ఈనెల 16న ఉన్నదన్న విషయాన్బీ సీబీఐ అధికారులు స్వయంగా తెలియచేశారని కవిత తెలిపారు. ఈ విషయంపై తమ లీగల్ టీమ్ తో డిస్కస్ చేస్తున్నామని, సత్యం నా తోడుగా సంపూర్నంగా అధికారులకు సహకరిస్తానని కల్వకుంట్ల కవిత ఎక్స్ లో పోస్టు ద్వారా తన స్పందనను తెలియజేశారు.
Next Story

