క్లారిటీ లేకపోతే.. ఇక...ఎప్పటికీ గెలవలేరు...!

రాజకీయాలైనా.. మరేదైనా.. కొన్ని కొన్ని సందర్భాల్లో మాత్రం చాలా వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఆలస్యం.. అమృతం విషం!అనే నానుడి ఒక్కొక్కసారి రాజకీయాల్లోనూ పనిచేస్తుంది. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ప్రధాన విపక్షం వైసీపీలోనూ చోటు చేసుకుంది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి రావాలని భావిస్తున్న వైసీపీ.. అంతే నిశిత దృష్టితో.. దూర ఆలోచనతో అభ్యర్థుల ఎంపిక కూడా చేపడుతోంది. అయితే, కొన్ని కొన్ని నియోజక వర్గాల విషయం లో మాత్రం వైసీపీ చేస్తున్న తీవ్రమైన ఆలస్యం కారణంగా.. అధికార పార్టీ టీడీపీని నిలువరించే పరిస్థితి ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలాంటి టీడీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాలపై ముందస్తుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఇక్కడ అభ్యర్థి ఎవరు...?
విజయవాడలోని మూడు నియోజకవర్గాల్లో... కీలకమైంది.. టీడీపీకి గట్టిపట్టున్న నియోజకవర్గం విజయవాడ తూర్పు. ఇక్క డ నుంచి సీనియర్ నాయకుడు, ప్రజల్లో మంచి పేరున్న గద్దె రామ్మోహన్ గత ఎన్నికల్లో గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనకే టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రజల్లో బలమైన నాయకుడిగా గద్దెకు మంచి పేరుంది. పైగా తూర్పు నియోజకవర్గంలో కమ్మసామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో గెలుపు గుర్రంఎ క్కడం ఆయనకు అత్యంత ఈజీ. మరి ఇదే సమయంలో వైసీపీ అభ్యర్థి ఎవరు? అనే విషయంలో మాత్రం పార్టీ అధినేత జగన్ ఇప్పటికీ ఏమీ తేల్చుకోలేక పోయారనే చెప్పాలి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ప్రస్తుతం రాజకీయంగా సంధికాలంలో ఉన్నారు. ఆయన వైసీపీలో ఉండాలా ? లేదా జనసేనకు జంప్ చేయాలా ? అన్నది తేల్చుకోలేకపోతున్నారు.
రవి చేరికతో.....
అలాగే వైసీపీలో ఉంటే ఆయన పోటీ చేస్తే తూర్పు మాత్రమే దిక్కుగా ఉంది. ఇక రాధాను పక్కన పెట్టేస్తే ఆ పార్టీకి ఇక్కడ నుంచి ఇద్దరు కీలక నాయకులు ఉన్నారు. బొప్పన భవకుమార్. తూర్పులో గత రెండేళ్లలో పార్టీని ఒకింత నిలబెట్టారనే చెప్పాలి. కమ్మవర్గానికి చెందిన భవ కుమార్ తూర్పు టికెట్‌ను ఆశిస్తున్నారు. ఇక, ఏడాది కిందట టీడీపీలో అసంతృప్తిగా ఉన్న యలమంచిలి రవిని జగన్ తన పార్టీలోకి చేర్చుకున్నారు. దీంతో తూర్పు టికెట్‌ను ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఇవ్వా లి అయితే, ఈ విషయంలో జగన్ దూకుడు చూపించకుండా.. మెతక వైఖరి అవలంబిస్తున్నారు. జగన్ ఈ సీటు విషయంలో నాన్చడం వెనక మరో కారణం కూడా కనిపిస్తోంది.
రాధా కోసమేనా?
రాధా పార్టీలో ఉంటే ఆయనకు తూర్పు సీటు ఇవ్వాలి... ఆయన ఏం చేస్తాడో ? చూద్దామనే ధోరణిలో జగన్ తూర్పు సీటుపై క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ఇక్కడ అభ్యర్థి విషయంలో వైసీపీ నేతల్లోనే తీవ్ర గందరగోళం ఏర్పడుతోంది. మరో నాలుగు మాసాల్లోనే ఎన్నికలు ఉండడం, ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే పట్ల ప్రజల్లో నమ్మకం ఉన్న నేపథ్యంలో వైసీపీ తన అభ్యర్థిని వెంటనే ప్రకటి్స్తే.. ముందస్తుగా ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. అలా కాకుండా.. ఎన్నికల వరకు నాన్చుడు ధోరణి అవలంబిస్తే.. ఇప్పటికే దూకుడు ప్రదర్శిస్తున్న గద్దెకు పోటీ ఇవ్వడం కూడా చాలా కష్టమేనని చెబుతున్నారు. మరి వైసీపీ అధినేత జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
- Tags
- andhra pradesh
- ap politics
- boppana bhavakumar
- janasena party
- kirshna district
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- vangaveeti radha
- viayawada east constiuency
- y.s. jaganmohan reddy
- yalamanchili ravi
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కృష్ణా జిల్లా
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- బొప్పన భవకుమార్
- యలమంచిలి రవి
- వంగవీటి రాధా
- విజయవాడ తూర్పు నియోజకవర్గం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ