వంగవీటి జంప్...!!
గత కొంతకాలంగా మౌనంగా ఉన్న వంగవీటి రాధా నేడు గళం విప్పనున్నారా? ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి వెళ్లనున్నారా? అవును ఈరోజు వంగవీటి రాధా తాను వైసీపీ నుంచి వైదొలుగుతున్న విషయాన్ని చెబుతున్నారంటున్నారు. అలాగే జనసేనలో చేరే ప్రకటన కూడా ఈరోజు వంగవీటి రాధా చేయనున్నారు. వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా ఆయన ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు రాధా సన్నిహితులు చెబుతున్నారు. జనసేనలో చేరేందుకు కూడా రాధాకు అంతా లైన్ క్లియర్ అయ్యిందంటున్నారు. పవన్ కల్యాణ్ ప్రస్తుతం నగరంలో లేనందున ఆయన వచ్చాక ఆయన సమక్షంలో భారీ ర్యాలీతో వంగవీటి చేరాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
జనసేనలోకి త్వరలో....
వంగవీటి రాధా గత కొంతకాలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన మనసంతా జనసేనలోనే ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ వంగవీటి రాధాను విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి గాని, బందరు పార్లమెంటు నుంచి గాని పోటీ చేయాలని చెప్పారు. ఈ మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పార్టీ ఇన్ ఛార్జిగానియమించారు. దీంతో రాధా గత ఆరు నెలల నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తన సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు.
టీడీపీ ఆఫర్ ఇచ్చినా....
వంగవీటి రాధాకు టీడీపీ నుంచికూడా ఆఫర్ వచ్చింది. అయితే టీడీపీలో చేరినా సెంట్రల్ నియోజకవర్గం సీటు దక్కదు. అక్కడ ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఉన్నారు. రాధా పార్టీలో చేరితే రాజ్యసభ పదవి ఇస్తామని టీడీపీ సంకేతాలను కూడా పంపింది.కాని రాధా అందుకు అంగీకరించలేదు. అనుచరులు, సన్నిహితులతో మంతనాలు జరిపిన తర్వాత వంగవీటి రాధా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా సెంట్రల్ నియోజకవర్గం నుంచిపోటీచేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్నారు.
రెండు నియోజకవర్గాల్లో...
ఈరోజు తన తండ్రి వంగవీటి రంగా వర్థంతి కావడంతో ఈ సందర్భంగా ఆయన బహిరంగ ప్రకటన చేసే అవకాశం ఉందని రాధా, రంగా మిత్రమండలి సభ్యులు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వంగవీటి రాధా, తూర్పు నియోజకవర్గం నుంచి పారిశ్రామికవేత్త కోగంటి సత్యంను బరిలోకి దింపాలని జనసేనాని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో రాధా వచ్చే ఎన్నికల్లో సెంట్రల్ నియోజకవర్గం నుంచే జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగుతారని దాదాపుగా తేలిపోయినట్లే. ఈరోజు రాధా స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముంది.
- Tags
- andhra pradesh
- ap politics
- janasena party
- krishna district
- malladi vishnu
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- vangaveeti radha
- vijayawada central constiuency
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కృష్ణా జిల్లా
- జనసేన పార్టీ
- తెలుగుదేశం పార్టీ
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- మల్లాది విష్ణు
- వంగవీటి రాధా
- విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ