ఒకేసారి గెలిచిన చోట దిక్కెవరు....!!
రాష్ట్రంలో రాజకీయాలకు కేంద్రంగా ఉండే విజయవాడ ఇప్పుడు రాజధాని నగరంగా కూడా దూసుకుపోతోంది. అయితే, ఇక్కడి రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. ఆది నుంచి కూడా వ్యక్తుల ప్రాబల్యం మీదనే ఇక్కడి రాజకీయాలు నడిచాయి. అయితే, రాను రాను పార్టీల ప్రాబల్యం పెరుగుతున్నా.. వ్యక్తుల శాసనాల మేరకే ఇక్కడ రాజకీయాలు నడుస్తు న్నాయి. ఇక, ఇక్కడ అధికార టీడీపీకి తూర్పు నియోజవకర్గం కంచుకోటగా ఉంది. గతంలో ఒక్కసారి ప్రజారాజ్యం పార్టీ ఎమ్మెల్యే గెలిచినా.. 2014లో మాత్రం తూర్పు, సెంట్రల్ కూడా టీడీపీ ఖాతాలోనే పడ్డాయి. కానీ, విజయవాడ పశ్చిమ విషయానికి వస్తే... ఇక్కడ టీడీపీకి దిక్కులేకుండా పోతోంది. ఇక్కడ టీడీపీ పాతుకుపోతుందని నాయకులు భావిస్తున్నా.. అలాంటి లక్షణాలు ఇక్కడ ఏ ఒక్కటీ కనిపించడం లేదు.
కమ్యునిస్టులకు కంచుకోటగా....
1953లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి నుంచి కమ్యూనిస్టులకు కాంగ్రెస్‌కు ఈ నియోజకవర్గం కంచుకోటగా మారింది. ఆ తర్వాత అన్నగారు ఎన్టీఆర్ టీడీపీ పెట్టిన నేపథ్యంలో 1983లో టీడీపీ టికెట్ పొందిన బీఎస్ జయరాజు ఇక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత అనేక మంది ప్రముఖులు ఇక్కడ నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసినా..ఏ ఒక్కరూ ఇప్పటి వరకు గెలవలేక పోయారు. ఇక్కడ నుంచి నాగుల్ మీరా(ప్రస్తుతం ఏపీ పోలీస్ హైసింగ్ బోర్డు చైర్మన్) పోటీ చేసినా.. ఏ ఒక్కసారీ ఇక్కడ నుంచి విజయం సాధించలేకపోయారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన జలీల్ ఖాన్ కూడా వైసీపీ టికెట్‌పై విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో చంద్రబాబు చెంతకు చేరిపోయారు.
అల్టర్ నేట్ లేక.....
నిజానికి టీడీపీ కాకుండా కొత్తపార్టీలకు కూడా ఇక్కడి ప్రజలు పట్టం కట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి నేప థ్యంలో ఇప్పుడు 2019 ఎన్నికల నేపథ్యంలో ఇక్కడ నుంచి జలీల్‌ఖాన్ తన కుమార్తెను బరిలోకి దింపాలని నిర్ణయించు కున్నారు. టికెట్‌పై ఇప్పటికే ఒక దఫా చంద్రబాబుతో చర్చలు కూడా జరిగాయి. తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని , కాబట్టి తనకు మార్తెకు ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఇదిలావుంటే, ఇస్తే.. జలీల్ ఖాన్‌కు లేదంటే.. వేరేవారికి టీడీపీ టికెట్ దక్కుతుందనే ప్రచారం జరుగుతోంది అయితే, ఇక్కడ ఆల్టర్నేట్ లేకుండా పోయింది. ఇక్కడ కేవలం నాగుల్ మీరా తప్ప మరో నాయకుడు టీడీపీలో ఎదిగింది లేదు. ఈ నేపథ్యంలో జలీల్‌ను కాదంటే.. నాగుల్ మీరాకే టికెట్ ఇవ్వాలి. మరి ఇచ్చినా గెలుస్తారనే నమ్మకం లేదు. మరి ఈ నేపథ్యంలో ఇక్కడ టీడీపీని నిలబెట్టే దెవరు అనే చర్చ జోరుగా సాగుతోంది.
- Tags
- andhra pradesh
- ap politics
- communists
- jaleel khan
- janasena party
- krishna district
- nagul meera
- nara chandrababu naidu
- pawan kalyan
- telugudesam party
- vijayawada west constiuency
- y.s. jaganmohan reddy
- ysr congress party
- ఆంధ్రప్రదేశ్
- ఏపీ పాలిటిక్స్
- కమ్యునిస్టులు
- కృష్ణా జిల్లా
- జనసేన పార్టీ
- జలీల్ ఖాన్
- తెలుగుదేశం పార్టీ
- నాగుల్ మీరా
- నారా చంద్రబాబునాయుడు
- పవన్ కల్యాణ్
- విజయవాడ పశ్చిమ నియోజకవర్గం
- వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి
- వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ