అంతా అయిపోయింది..తమ్ముళ్లూ...!!
ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడే కాంగ్రెస్ ఓటమికి ప్రధాన కారణంగా చెప్పకతప్పదు. తెలంగాణ రాష్ట్ర సమితి కె.చంద్రశేఖర్ రావు వేసిన గూగ్లీకి విపక్ష పార్టీలు కుదేలయిపోయాయి. శాసనసభ రద్దు అయినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితికి అంత ఫేవర్ గా లేదు. కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇస్తుందనుకున్నారు. అయితే తెలుగుదేశం పార్టీతో పొత్తుతోనే కాంగ్రెస్ తన చేతులతో తానే అధికారాన్ని దూరంచేసుకుందని గట్టిగా చెప్పొచ్చు. దీనికి చంద్రబాబు కేసీఆర్ పై చేసిన విమర్శలే ప్రధాన కారణమంటున్నారు విశ్లేషకులు.
గాయపర్చారా....?
చంద్రబాబునాయుడు తెలంగాణ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పొత్తులో భాగంగా సీట్లు విషయంలో పెద్దగా పట్టుదలకు పోకుండా ఆయన కేసీఆర్ ఓటమికే కృషిచేశారు. దాదాపు వారం రోజుల పాటు చంద్రబాబునాయుడు ఇక్కడ ప్రచారం చేశారు.కేసీఆర్ చేసినవిమర్శలకు మౌనంగా ఉండాల్సిన చంద్రబాబునాయుడు వ్యక్తిగతదాడులకు దిగడం, తానే ఆధునిక తెలంగాణ సృష్టికర్తనని చెప్పడం తెలంగాణ వాసుల మనసును గాయపర్చిందంటున్నారు. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన సభల్లో కేసీఆర్ పై ఒంటికాలుపై లేవడం కూడా ప్రజాకూటమికి ఎదురుదెబ్బ తగిలిందంటున్నారు.
బాబుతో పొత్తు లేకుంటే....?
చంద్రబాబు పార్టీతో పొత్తు లేకుండా కాంగ్రెస్, తెలంగాణ జనసమితి, సీపీఐలు కలసి పొత్తుతో ముందుకు వెళ్లి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించేదన్న విశ్లేషణలు విన్పిస్తున్నాయి. తెలంగాణ లో వన్ సైడ్ ఓటింగ్ జరుగుతుందని ఎవరికీ ఊహకందలేదు. మంచి పోటీ ఇస్తుందని తొలి నుంచి అందరూ భావించారు. కూటమిగా ఏర్పడటం తమకు కలసి వస్తుందని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా అంచనా వేసింది. ఢిల్లీలో టిక్కెట్ల కేటాయింపుల జాతర, చంద్రబాబు, రాహుల్ గాంధీ కలసి చేసిన రోడ్ షోలు కూడా ప్రజాకూటమికి కలసి రాలేదు.
సెంటిమెంట్ ను...
నీటి సమస్య, తెలంగాణ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా కేంద్రానికి లేఖలు రాయడం వంటి అంశాలు కూడా బాగా పనిచేశాయి. కూటమి అధికారంలోకి వస్తే చంద్రబాబు నేతృత్వంలోనే తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందన్న విషయాన్ని కేసీఆర్ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. పోటా పోటీగా ఉన్న ఎన్నికల్లో చంద్రబాబు ఎంటరై పూర్తిగా ఫలితాలను ఛేంజ్ చేశారన్నది విశ్లేషకుల భావన. సెంటిమెంట్ ను తీసుకురావడంలో సక్సెస్ కాగా, కూటమి నేతలు బాబుతో పొత్తు పెట్టుకుని కుదేలైపోయారన్న వ్యాఖ్యలు ఆ పార్టీ నుంచే విన్పిస్తుండటం విశేషం.
- Tags
- cpi
- indian national congress
- k.chandrasekharrao
- kodandaram
- prajakutami
- telangana elections
- telangana janasamithi
- telangana rashtra samithi
- ts politics
- uttam kumar reddy
- ఉత్తమ్ కుమార్ రెడ్డి
- కె. చంద్రశేఖర్ రావు
- కోదండరామ్
- టీఎస్ పాలిటిక్స్
- తెలంగాణ ఎన్నికలు
- తెలంగాణ జనసమితి
- తెలంగాణ రాష్ట్ర సమితి
- ప్రజాకూటమి
- భారత జాతీయ కాంగ్రెస్
- సీపీఐ